8 member food delivery boys gang held for buglary వృత్తి ఫుడ్ డెలివరీ బాయిస్.. ప్రవృత్తి దోపిడీలు..

8 member food delivery boys gang held for buglary in bachupally

food delivery boys, zomato, swiggy, bachupally, banjara hills, robbery gang, yousufguda, Bowrampet, Gandimaisamma area, Cyberabad police, Hyderabad, crime

The Bachupally police on Saturday arrested an eight-member robbery gang on charges of targeting people in secluded areas and robbing them. The arrested persons were K.Vinay (22), a food delivery executive from Yousufguda, S.Mahesh Kumar (19) a painter from Banjara Hills, K.Manideep, a wine shop worker from Jeedimetla, Veeresh, Rakesh, Vijay, Dilip and Kiran.

వృత్తి ఫుడ్ డెలివరీ బాయిస్.. ప్రవృత్తి దోపిడీలు..

Posted: 05/15/2021 04:58 PM IST
8 member food delivery boys gang held for buglary in bachupally

తను చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు.. ఒక్కడి బుద్ది వక్రమార్గం పట్టిందంటే చాలు తన వక్రబుద్ది.. రాత్రికి రాత్రే తన అర్థిక పరిస్థితి మారాలన్న వాంఛ వారిని వక్రమార్గంలో నడిచేలా చేస్తోంది. ఒక్కడు దురాలోచనలతో వారి స్నేహితులు కూడా వాడి మాటలకు, చర్యలకు ప్రభావితం కావడం కామన్. తెలివైన వారైతే వాడి నుంచి దూరంగా జరుగుతారు. కానీ వక్రమార్గంలో నడిచైనా తాము సంపన్నులం కావాలని అనుకునేవారు తప్పక ఆవేశంలో తప్పులు చేసి.. అరదండాలు వేయించుకుంటారు. ఒక్క రోజు తప్పించుకోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు మాత్రం చట్టానికి దొరక్కాల్సిందే.

ఎంతైంటి తెలివైనవారైనా నేరానికి పాల్పడితే కటకటాలు లెక్కబెట్టాల్సిందేనన్న విషయం తెలిసి కూడా ఇంకా వక్రమార్గంలో వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య ఉందంటేనే ఆశ్చర్యంగా వుంది. తాజాగా ఇలాంటి ఓ ముఠా పోలీసుల వలలో అడ్డంగా చిక్కింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఫుడ్ డెలివరీ బాయిస్ గా విధులు నిర్వహిస్తారు. అయితే రాత్రి కాగానే వారిలోని చీకటి కోణం బయటపడుతోంది. అప్పటి వరకు కష్టించి పనిచేసిన వీరు ఈజీ మనీ వేటలో పడి దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. వృత్తిరిత్యా ఒకటి, ప్రవృత్తి మరోమార్గాన్ని అనుసరించి ఏడు ఊచలు లెక్కబెడుతున్నారు.

పుడ్ డెలివరీ యాప్ జోమాటో, స్విగ్గిలలో డెలివరీ బాయిస్ గా చేస్తూ చీకటి పడితే చాలు ఒంటరిగా వున్న వారిని టార్గెట్ చేసుకుని దారి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంట‌రిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోల‌లో ప‌ని చేస్తున్న‌ట్లు వివ‌రించారు. విలాసాలకు అల‌వాటు ప‌డిన యువ‌కులు ఈ విధంగా దోపిడీలు చేస్తున్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు. చోరి చేసిన ఫోన్లు, ఇత‌ర సామ‌గ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : food delivery boys  zomato  swiggy  bachupally  robbery gang  Hyderabad  crime  

Other Articles