Mucormycosis Cases are increasing, says AIIMS chief 'కోవిడ్ రోగుల్లో మధుమేహా నియంత్రణతో బ్లాక్ ఫంగస్ కట్టడి'

Aiims chief dr guleria warns of surge in fungal infection in covid patients

Black Fungus, Mucormycosis, AIIMS director Dr Randeep Guleria, diabetic, fungal infection, Oxygen, Ventilator, India Covid crisis, India Covid news, Coronavirus news, Coronavirus latest news, Coronavirus, coronavirus second wave, covid-19, covid deaths in India

With a pattern emerging of more than 90% of mucormycosis patients being diabetics, AIIMS director Dr Randeep Guleria has emphasized the urgent need to control and monitor sugar levels in COVID-19 patients. He also warned about a surge in mucormycosis, which is a rare fungal infection, across India.

కోవిడ్ రోగుల్లో మధుమేహా నియంత్రణతో బ్లాక్ ఫంగస్ కట్టడి: ఎయమ్స్ చీఫ్

Posted: 05/15/2021 03:26 PM IST
Aiims chief dr guleria warns of surge in fungal infection in covid patients

కోవిడ్ నుంచి కోలుకుంటున్న, కోలుకున్న రోగుల్లో బ్లాక్ ఫంగస్ సోకడంతో అది అత్యంత ప్రమాదకరంగా మారి ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో అందోళన వ్యక్తం చేసిన ఎయిమ్స్ డైరెర్టక్ రణ్ దీప్ గులేరియా బ్లాక్ పంగన్ ను అత్యంత సమర్థవంతంగా నియంత్రించాల్సిన అవసరం వుందని అన్నారు. ఇప్పడివరకు బ్లాక్ ఫంగస్ సోకుతున్న వారిలో అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులే అధిక సంఖ్యలో వున్నారని తెలిపారు. దాదాపుగా 90 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు కరోనా నుంచి కోలుకున్న తరుణంలో దీని బారిన పడ్డారని.. దీంతో కోవిడ్ రోగులలో మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న కోవిడ్ రోగులలో షుగర్ లెవెల్స్ ఎలా వున్నాయన్న పరిశీలించి, నియంత్రించాలని ఆయన సూచించారు.

ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ఎక్సిలెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లాలకు చెందిన క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్ పంగస్ కేసులు వేగంగా పెరగడానికి కారణమైన డేటాను పరిశీలించగా, అందులో మధుమేహంతో బాధపడుతున్న వారిలోనే ఈ ప్రాణాంతక ఫంగస్ అధికంగా వుందని తేలిందని, అందుకు బలమైన స్టెరాయిండ్లు వినియోగించడమే కారణమని కూడా తెలుస్తుందని అన్నారు. ఇక అందులోనే అత్యధికంగా ఈ ప్రాణాంతక ఫంగస్ కేసులు ప్రభుత్వ అసుపత్రుల నుంచే నమోదు అవుతున్నాయన్న విషయం తెలిసిందని అన్నారు, ఈ మేరకు గుజరాత్ వైద్యులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

స్టెరాయిండ్స్ వాడిన కోవిడ్ రోగులు లింపోపెనియాకు కూడా గురువుతారని.. ఇక దీనికి తోడు ఫవర్ ఫుల్ స్టెరాయిండ్స్ వాడటంతో వారిలో షుగర్ లెవెల్స్ అధికంగా వుంటాయని అన్నారు. ఇక కరోనా తొలిదశలో దాని నుంచి కోలుకున్న రోగులలో మాత్రమే కనిపించిన బ్లాక్ పంగస్.. రెండో దశలో మాత్రం కోవిడ్ బారిన పడిన రోగుల్లోనూ బ్లాక్ పంగస్ కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో తాము ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఎదుర్కోంటున్నామని అన్నారు. దీంతో స్టెరాయిండ్స్ వినియోగాన్ని మోతాదులోనే వినియోగిస్తూ, మధుమేహాన్ని నియంత్రిస్తూ కరోనా రోగులకు వైద్యం అందించాలని రణ్ దీప్ గులేరియా సూచనలు చేశారు.

దీంతో పాటు కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్న ప్రస్తుతం తరుణంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles