Sputnik V jab on sale in India for Rs 995 per dose స్పుట్నిక్-వి టీకా ధరను నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్..

Dr reddys announces soft launch of sputnik vaccine to cost rs 995 40 per shot

Sputnik V, Dr Reddy's, Russian Direct Investment Fund, Sputnik V vaccine, first dose of Sputnik V vaccine, Sputnik V India, COVID vaccine, covid-19, covaxin, covishield, sputnik-V, Dr. Reddy Labs, vaccine doses, covid-19 vaccines, COVID-19 vaccination in India, Covid 19, Coronavirus, Coronavirus pandemic, Coronavirus update

Dr Reddy's Laboratories Ltd will sell Sputnik V vaccine at ₹995 per dose for shots imported from Russia and has also begun the soft launch of the covid-19 vaccine in India using the 150,000 shots it had procured earlier this month

స్పుట్నిక్-వి టీకా ధరను నిర్ణయించిన డాక్టర్ రెడ్డీస్..

Posted: 05/15/2021 12:09 AM IST
Dr reddys announces soft launch of sputnik vaccine to cost rs 995 40 per shot

రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్ఎఫ్ఐడీ) ఆధ్వర్యంలో గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకాల ధర ఖారారైంది. భారత్ తో స్పుట్నిక్ వి వాక్సీన్ ధరను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఖరారు చేసింది. అదేంటి రష్యాకు చెందిన వాక్సీన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించమేంటి.? అనుకుంటున్నారా.? భారత్ లో స్పేత్నిక్ వి టీకాను అభివృద్ది చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ మేరకు రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీంతో దేశంలో దీని ఒక్కో డోసుకు రూ.995గా నిర్ణయించింది. అయితే ఒక్క డోసు ధరను రూ. 948గా నిర్ణయించగా, దానికి 5% జీఎస్టీతో రూ.995గా ఉండనుంది. 

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉండడం.. అందునా ఏకంగా 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో ఇప్పటికీ కేవలం రెండు వాక్సీన్లకు మాత్రమే అనుమతి పొందడంతో కోరత తీవ్రమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం గత వారంమే స్పుత్నిక్ టీకాలకు అమోదం తెలిపింది. అంతేకాదు వాటిని దిగుమతి చేసుకోవడంతో పాటు వాటి ఉత్పత్తిని దేశీయంగా చేసేందుకు కూడా అనుమతిని అందించింది. ఈ క్రమంలో ఇటు రెడ్డీస్ కూ స్పుత్నిక్ టీకాల ఉత్పత్తికి అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం వాటి ధరలను సంస్థ ఖరారు చేసింది. పరిమిత పైలట్ ప్రాజెక్టులో భాగంగా స్పుత్నిక్ వి టీకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక తొలి డోసును లబ్ధిదారుకు వేసినట్టు వెల్లడించింది.

అయితే రెడ్డీస్ ల్యాబ్ స్పుట్నిక్ టీకాల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించిందా.. లేదా అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ ధర కేవలం దిగుమతి చేసుకున్న వాక్సీన్లకు మాత్రమే పరిమితం అని చెప్పడంతో దేశీయంగా ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదన్న సంకేతాలను ఇచ్చినట్టు అయ్యింది. అయితే దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయని చెప్పింది. మే 1న భారత్ కు దిగుమతైన వ్యాక్సిన్ల వాడకానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులను ఇచ్చిందని చెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని డోసులు దేశానికి వస్తాయని తెలిపింది. దాంతో పాటు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లూ మార్కెట్ లోకి వస్తాయంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles