Telangana HC fires on Govt for sudden Lockdown హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

Telangana high court fires on government for sudden lockdown

coronavirus, covid-19, HC, Telangana lockdown, High Court, other District people, Other states labour, cabinet meeting, CM KCR, Telangana, Politics

Telangana High Court fires on Government for sudden Lockdown and shut down in the state with out making arrangements for other districts and state people go to their home town.

హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

Posted: 05/11/2021 10:24 PM IST
Telangana high court fires on government for sudden lockdown

తెలంగాణలో బుధవారం ఉదయం పది గంటల నుంచి లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీవ్రంగా మండిపడింది. లాక్ డౌన్ మార్గదర్శకాలను వెలువరించనున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఉపశమనం కల్పిస్తారని ప్రశ్నించింది. మరోవైపురాష్ట్ర ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, సమాయత్తం అయ్యేందుకు సమయం కానీ ఇవ్వకుండా హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక్కసారిగా బుధవారం నుంచి లాక్ డౌన్ అని ప్రకటిస్తే... ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి అలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రోజువారీ కూలీ చేసుకుంటూ బతుకుతున్న వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది.

రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలకు ఎలాంటి ఉపశమనం కల్పించకుండా లాక్ డౌన్ విధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  దీనికి సమాధానంగా ఇప్పటికే 50 శాతం మంది వలస కార్మికులు వాళ్ల సొంతూళ్లకు వెళ్లిపోయారని కోర్టుకు ఏజీ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో సాయంత్రం వేళల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా? అనే హైకోర్టు ప్రశ్నకు బదులుగా... ఎలాంటి సడలింపులు ఉండవని ఏజీ చెప్పారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై వివరాలను తెలపడానికి మూడు రోజుల సమయం కావాలని కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఈలోగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాలా? అని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  HC  Telangana lockdown  CM KCR  Telangana  Politics  

Other Articles