Telangana govt gives relaxation to agri sector తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ మార్గదర్వకాలివే..

Telangana government gives relaxation to agri pharma electrical sectors

coronavirus, covid-19, HC, Telangana lockdown, Lock down, Guidelines, cabinet meeting, CM KCR, Agriculture, Pharma, Electrical, government employess, Telangana, Politics

The Telangana Government issues Guidelines to be followed during the Lockdown, The Cabinet gives relaxation to agriculture sector, including Pharma, Electrical departments and government employees

లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Posted: 05/11/2021 10:47 PM IST
Telangana government gives relaxation to agri pharma electrical sectors

కరోనా రెండో దశ వేగంగా విజృంభిస్తూ మృత్యుఘంటికలను మ్రోగిస్తున్న నేపథ్యంలో భేటీ అయిన తెలంగాణ క్యాబినెట్  బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కాగా దాదాపుగా నాలుగు గంటల పాటు భేటీ అయిన క్యాబనెట్ ఆ తరువాత లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.

జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు ఇచ్చారు. ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిథిగా పనిచేస్తాయి. అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంది.

తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ  ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Telangana lockdown  Guidelines  Agriculture  Pharma  Telangana  Politics  

Other Articles

Today on Telugu Wishesh