Simhachalam trust member questions on her removal ఇదెక్కడి న్యాయం జగనన్నా.? సింహచలం బోర్డు సభ్యురాలి నిలదీత

Dadi devi to fight legally on her removal from simhachalam temple trust board member

Simhachalam Trust Board, Sanchaita Gajapatiraju, Chairman, Dadi Devi, Court, Stay, Sri Varahalakshmi Narasimha Swamy Devasthanam, Vijayawada, YSRCP, YS Jagan, Visakhapatnam, Andhra Pradesh, Politics

Simhachalam Temple Trust Board Member Dadi Devi questions Andhra Pradesh CM YS Jagan on her removal, she approches Court and gets stay for 8 weeks.

ఇదెక్కడి న్యాయం జగనన్నా.? సింహచలం బోర్డు సభ్యురాలి నిలదీత

Posted: 05/11/2021 03:12 PM IST
Dadi devi to fight legally on her removal from simhachalam temple trust board member

తనను పిలిచి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా పదవిని కట్టబెట్టిన వారే ఇప్పుడు అర్థాంతరంగా తనను పదవిలోంచి తీసి వేసి అవమానించడం ఏంటని.. సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలు దాడి దేవి ప్రశ్నించారు. తనకు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా.. బోర్డు సభ్యురాలిగా తొలగించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన దేవి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతుండగా ఆమెను అకస్మాత్తుగా తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో విశాఖకు చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవి న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. తనకు న్యాయం చేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం అందించకుండా పదవిలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంపై ఆమె రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తన పదవీ కాలం ఇంకా వున్నప్పటికీ అర్థాంతరంగా తనను పదవిలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం తనను అవమానించడమేనని అమె తన హౌజ్ మోషన్ పిటీషన్ లో పేర్కొన్నారు. అమె పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం అమెను పదవిలోంచి తొలగిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. ఈ జీవో అమలును ఎనమిది వారాలపాటు నిలిపివేసిన న్యాయస్థాన ధర్మాసనం.. అప్పటి వరకు దాడి దేవిని పదవిలోనే కొనసాగించాలని సింహాచల ట్రస్టు బోర్డును అదేశించింది. అకస్మాత్తుగా దాడి దేవిని తొలగించడానికి కారణాలను తెలపాలని బోర్డును అదేశించింది.

దీంతో పాటు దాడి దేవిని పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విశాఖకు చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మిని నియమించడానికి గల కారణం ఏంటని కూడా న్యయాస్థానం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కమిషనర్, సింహాచలం దేవస్థానం ఈవోలతో పాటు, ఆళ్ల భాగ్యలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ట్రస్టు బోర్డు నుంచి తనను అకారణంగా తొలగించారంటూ దేవి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి తన భర్త పార్టీ కోసం పనిచేస్తున్నారని అయినప్పటికీ ఎలాంటి పదవులను తాము ఆశించలేదన్నారు. అయితే, పిలిచి మరీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. మరి అలాంటిది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం జగనన్నా? అంటూ నిలదీశారు.  తనను ఎందుకు తొలగించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles