OU student leader wife recollects her husband last words భార్యతో ఓయు విద్యార్థి నేత ఆఖరి మాటలు..

Ou student leader bellamkonda krishna goud wife recollects her husband last words

Osmania University, Bellamkonda Krishna Goud, Nims, Last words, Oxygen, Ventilator, India Covid crisis, India Covid news, Coronavirus news, Coronavirus latest news, Coronavirus, coronavirus second wave, covid-19, covid deaths in India

Osmania University student leader Bellamkonda Krishna Goud who was fatal after being a victim of coronavirus, undergone treatment in NIMS for 10 days. His wife recollects her husband last words, in which is says that no one is taking care of, even after struggling no body bothers to give him oxygen.

కరోనా కన్నీటిగాధలు: భార్యతో ఓయు విద్యార్థి నేత ఆఖరి మాటలు..

Posted: 05/11/2021 02:24 PM IST
Ou student leader bellamkonda krishna goud wife recollects her husband last words

ధేశంలో కరోనా వైరస్ రెండో దశ శరవేగంగా విస్తరిస్తూ లక్షలాధి మంది దాని ప్రభావానికి గురవుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా విమర్శల జడివాన కురుస్తోంది. అయితే ప్రభుత్వాలు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా వాస్తవానికి కరోనాబారిన పడిన రోగుల పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించే పలు వీడియోలు, ఫోన్ వాయిస్ రికార్డింగులు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఇలాంటి హృదయవిదారక ఘటనలు అనేకం జరుగుతున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు వున్నాయి.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం అంతా సవ్యంగానే సాగుతోందని ప్రభుత్వం, వైధ్యశాఖ అధికారులు ప్రకటిస్తున్నా.. ఉస్మానియా విద్యార్థి నేత మరణం మాత్రం పలు ప్రశ్నలను తెరపైకి తీసుకువస్తోంది. ఆయన తన భార్యతో జరిపిన చివరి ఫోన్ సంభాషణ తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని అసుపత్రుల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి బారిన పడిన ఉస్మానియా విద్యార్థి సంఘం నేత బెల్లంకొండ కృష్ణా గౌడ్ సోమవారం ఉదయం మరణించాడు. సూర్యపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రికి చెందిన ఆయన వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని ఆయన భార్య అరోపించారు.

తన భర్త తనతో చివరిగా ఆదివారం రోజు రాత్రి ఫోన్ లో మాట్లాడారని అమె అన్నారు. ఈ మాటలను విన్న అందరి హృదయాలు కదులుతున్నాయి. పది రోజులుగా నిమ్స్ అసుపత్రిలో చికిత్స పోందుతున్నా.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సాచ్యురేషన్ లెవల్స్ తక్కువగా వున్నా తనకు కనీసం అక్సిజన్ పెట్టేలేదని భార్యతో వాపోయాడు. ఆక్సిజన్ పెట్టకపోవడంతో తనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా వుందని చెప్పాడు. తనను త్వరగా ప్రైవేటు అసుపత్రికి తీసుకువెళ్తే తప్ప తాను బతకనని చెప్పాడు. ఇప్పటికైతే బతికే వున్నాను కానీ తర్వాతి సంగతి చెప్పలేనని వాపోయాడు. అసుపత్రి వర్గాలు మాత్రం కృష్ణను వెంటిలేటర్ పైనే చికిత్స అందించామని పేర్కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles