Over 140 Bodies Wash Up On Banks Of Ganga, Yamuna గంగా, యమునా నదుల్లో కరోనా మృతదేహాలు

Covid panic in bihar town as over 140 bodies wash up on banks of ganga

cremation bodies, bodies in ganga, dead bodies in ganga bihar, buxar dead bodies, chausa dead bodies, ganga yamuna dead bodies floating, Dead bodies, Ganga river, Buxar, Bihar, Uttar Pradesh, Coronavirus, Covid-19

In an absolutely shocking and inhuman incident, bodies of over 150 reported Covid fatalities were found piling at a ghat on river Ganges in Bihar's Buxar. The All India Mahila Congress targetted the BJP over the reports of bodies being dumped in the river.

అటు గంగా.. ఇటు యమునా నదుల్లో తేలిన కొవిడ్ మృతదేహాలు

Posted: 05/10/2021 11:49 PM IST
Covid panic in bihar town as over 140 bodies wash up on banks of ganga

కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ భీభత్సం తొలి దశ కన్నా భయానకంగా వుంది. కరోనా మరణాల లెక్క అంతుచిక్కడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో రెండో దశ విలయం కొనసాగుతోంది. అటు ఉత్తర్ ప్రదేశ్ లోని మహీర్ పూర్ లో యయునా నదిలో, ఇటు బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగా నదిలో కొవిడ్ మృతదేహాలు వెలుగు చూశాయి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు ఇలా నదిలో పడేశారని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తీరా చూస్తూ అటు గంగా నదిలో ఏకంగా 150కి పైగా మృతదేహాలు నీటిలో తేలగా, ఇటు యమునా నదిలోనూ పదుల సంఖ్యలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి.

గ్రామాల్లో కరోనా బారిన పడిన అనేక మంది మృత్యువాత పడుతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానాల్లో స్థలం కూడా సరిపోవడం లేదని, దీంతో శవాలను ఇలా నదిలోని నీటిలో పడవస్తే చనిపోయిన వారికి పునర్జన్మ ఉండదని భావించిన పలువురు అటు గంగా నది, ఇటు యమునా నదుల్లో మృతదేహాలను పడవేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మరికొన్ని గ్రామాల్లో యమునా నది ఒడ్డునే అంత్యక్రియలను కూడా నిర్వహించారు. ఈ వార్తలు వెలువడిన తరువాత బీహార్ లోని బక్సర్ జిల్లాలోనూ గంగా నదిలో 150 మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించాయి.

అయితే వీటి గురించి ఆరా తీయగా ఇవి ఉత్తరప్రదేశ్‌ నుంచి కొట్టుకు వచ్చాయని, తమ రాష్ట్రానికి చెందినవి కావని బక్సర్ జిల్లా అధికార యంత్రాంగం బదులు ఇచ్చింది. జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద సుమారు 100 మృతదేహాలు గంగా నది నీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చౌదాకు చెందిన బీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘మహదేవ్ ఘాట్‌కు 40 నుంచి 45 శవాల వరకు కొట్టుకువచ్చాయి. ఇవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి. కొవిడ్‌తో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉంది. దానికి ఒక కాపలా దారుడిని పెట్టి మరీ కాల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నామని అన్నారు.

అయితే ఈ మృతదేహాలు మాత్రం ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయి. నదిలో మృతదేహాలను అడ్డుకునే మార్గం లేనందున ఇక్కడి వరకు కొట్టుకువచ్చాయి’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కొవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్ కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్తుండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నెటిజెన్లు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid-19  dead bodies  featured  floating  ganga  ganges  Buxar  Bihar  Uttar Pradesh  Coronavirus  

Other Articles