Centre asks SC not to interfere in vaccine policy వాక్సీనేషన్ పాలసీలో జోక్యం వద్దు: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

No judicial interference centre to supreme court on vaccine policy

supreme court, central government, covid management, vaccine policy, affidavit, Coronavirus, coronavirus vaccination, vaccine pricing, vaccine distribution, Justice DY Chandrachud, Justice LN Rao, Justice S Ravindra Bhat, virtually hearing

Defending its Covid-19 vaccine policy amid criticism by some states, the Centre, in an affidavit, asked the Supreme Court not to interfere in the issue while saying that the 'wisdom of the executive should be trusted' in times of grave crisis such as what is being experienced presently.

వాక్సీనేషన్ పాలసీలో జోక్యం వద్దు: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

Posted: 05/10/2021 11:40 PM IST
No judicial interference centre to supreme court on vaccine policy

కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి అనుకున్న దానికన్నా అధికంగానే వుంది. కరోనా మృతులతో శ్మశాన వాటికలు కూడా సరిపోక పలు గ్రామాల్లో శవాలను రోడ్డు పక్కన వదిలేస్తుండగా, మరి కొన్ని చోట్ల నదుల్లోనే విసిరేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన మహమ్మారి నుంచి దేశ ప్రజలను కేవలం కరోనా వాక్సీన్ మాత్రమే కాపాడగలుగుతుందన్న వాదనల నేపథ్యంలో వాక్సీన్ ధరల్లో వత్యాసం, వాటి పంపిణీ విధానం సక్రమంగా లేకపోవడం, వాక్సీన్ కోరత, వాక్సీన్ పక్రియలో జాప్యం ఇతరాత్ర అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చేపట్టాల్సిన విచారణను నాలుగు రోజుల తరువాత గురువారానికి వాయిదా వేసింది.

దీనిపై కేంద్రాన్ని వివరణ కోరగా, కేంద్రం ఏకంగా 219 పేజీలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్ ను సుప్రీంకోర్టు ఇవాళ పరిశీలించింది. అయితే కేవలం రెండు నిమిషాల లోపు ఈ విచారణ ముగిసింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వీడియో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పదకొండు గంటలకు విచారణను ప్రారంభించగా, రెండు నిమిషాలలోపు సాంకేతిక లోపాలు తలెత్తడంతో విచారణ వాయిదా పడింది. తమ సర్వర్లు నెమ్మదించాయని, దీంతో ఈ విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థాన పేర్కోంది. కాగా శనివారం దాఖలు చేసిన అఫిడెవిట్ లో కేంద్రం పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.

వ్యాక్సినేషన్ అంశంలో న్యాయపరమైన జోక్యాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం తన వాదనలు వినిపించింది. అర్థవంతమైనదే అయినప్పటికీ అత్యుత్సాహంతో కూడిన జోక్యం విపరిణామాలకు దారితీస్తుందని, ఊహించని, అనాలోచిత పర్యవసానాలకు కారణమవుతుందని కేంద్రం వివరించింది. "ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశంలో శాస్త్రపరమైన, వైద్యపరమైన నిపుణుల సలహాలతో రూపొందించిన విధానం అమలు చేస్తున్నాం. ఇందులో న్యాయపరమైన జోక్యానికి అతికొద్ది అవకాశం మాత్రమే ఉంది. పరిష్కార మార్గాలు కనుగొనే క్రమంలో... నిపుణుల సలహాల కొరత, పరిపాలనా అనుభవం లేమి, వైద్యులు, శాస్త్రజ్ఞులు, నిపుణులు, కార్యనిర్వాహక వ్యవస్థల సలహాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తే జరిగే పరిణామాలు అనూహ్యం.

వ్యాక్సిన్ల ధరలకు సంబంధించిన అంశం సహేతుకమైనదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రీతిలో ఉంది. రెండు వ్యాక్సిన్ సంస్థలతో ఒప్పందం తర్వాతే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు 18 నుంచి 45 ఏళ్ల వయో విభాగాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాయి" అని కేంద్రం తన అఫిడవిట్లో వివరించింది. కాగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణకు ఉపక్రమించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, లావు నాగేశ్వరరావు, ఎస్.రవీంద్ర భట్ లతో కూడి త్రిసభ్య ధర్మాసనం సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. తమ సర్వర్ డౌన్ అయిందని, అఫిడవిట్ పై ఇవాళ విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  central government  covid management  vaccine policy  affidavit  

Other Articles