ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణలో తాను సాగిస్తున్నది మాత్రం ముమ్మాటికీ ఆత్మగౌరవ ఉద్యమమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఎన్నారైలతో ఆయన తాజాగా వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే నాపై నిందలు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసం కాదని తెలిపారు. తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని చెప్పుకొచ్చారు. 2014కు ముందు పాలకులు ప్రలోభాలకు లొంగిపోయి పాలన కొనసాగించారని, ప్రజల కోసం కాకుండా అధికారం కోసమే పాకులాడారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు కూడా అచ్చం అదే రీతిలో పాలన కొనసాగుతోందని ఈటల రాజేందర్ విమర్శించారు. చాలా మంది తెలంగాణ వాదులు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగాలని కోరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పద్ధతిలో పాలన కొనసాగడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ వాదుల భాగస్వామ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. అన్ని వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా కొనసాగాలని తనలాంటివారు చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన కొనసాగాలి తప్ప వారి అభిప్రాయాలకు విలువ లేకుండా పాలన కొనసాగడం సరికాదన్నారు.
అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు నిర్మించడం, రోడ్లు వేయించడం మాత్రమేనన్న భావన సరికాదని ఈటల రాజేందర్ చెప్పారు. 'ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం ఎందుకు కొట్లాడాం. బ్రిటిష్ వారు అభివృద్ధి పనులను చేయకపోవడం వల్ల కాదు. భారత జాతి స్వతంత్రంగా ఉండాలని స్వయం పాలన కావాలని కొట్లాడాం' అని ఆయన చెప్పుకొచ్చారు. తాను 1996 నుంచి సాగిస్తున్న వ్యాపారాలు, ఆదాయాలపై అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వత్రంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని తానే స్వయంగా కోరుతున్నా ప్రభుత్వం అ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తన వ్యవహారం నచ్చని పక్షంలో తనను పిలిపించి మాట్లాడితే తానే పదవులకు రాజీనామా చేసేవాడినని, కానీ పార్టీలో తాను ఒకడినై పోరాడిన తనపైనే ఇంత కక్షసాధింపు చర్యలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం తనను విమర్శిస్తున్న వారంతా తన సహచరులేనని ఆయన గుర్తు చేశారు. ఎవరో ఇస్తున్న తప్పుడు సలహాలు, సూచనలు, నివేదకలతో తనపై కక్షసాధిస్తున్నారని ఆయన అన్నారు. ఇక ప్రగతి భవన్ లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు లేదని ఆయన తీవ్ర విమర్శులు చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసిన తమకు గతంలో పరాభవం తప్పలేదని అయన ఆ ఘటనను గుర్తుచేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more