Mexico City metro overpass collapses onto road 13 dead వంతెనను చీల్చుకుని రోడ్డుపై పడిన మెట్రో రైలు..

Mexico city rail overpass collapses killing 15 and injuring 70

Mexico, Mexico city, Mexico news, Mexico City metro train, Mexico train accident, Mexico rail accident, mexican train tragedy, mexican train scary video, Metro train, accident, overpass collapse, resue efforts, Milenio TV, Olivos station, poor construction, marcelo ebrard, mexico mayor, crime

Fifteen people were killed and about 70 injured when a railway overpass collapsed onto a busy road in Mexico City. Rescue efforts for potential survivors were paused shortly after the accident, authorities said, because of the risk that more of the metro overpass and train cars could slam down onto the road.

ITEMVIDEOS: వంతెనను చీల్చుకుని రోడ్డుపై పడిన మెట్రో రైలు.. 20 మంది మృతి

Posted: 05/04/2021 08:34 PM IST
Mexico city rail overpass collapses killing 15 and injuring 70

ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఘోరప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు తన పాస్ ఓవర్ ను చీల్చుకుని కిందననున్న రోడ్డుపైకి పడింది. ఇక రెండు మెట్రో బోగీలు మాత్రం గాలిలో వేలాడుతూనే వున్నాయి. ఈ ప్రమాద ఘటనలో 20 మంది వరకు మరణించారు. సుమారు 70 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కింద ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పైన ఓవర్ పాస్ పై వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోవడంతో పైనుంచి పడిపోయింది.

ఈ ఘటనలో పలు బోగీలు ధ్వంసం అయ్యాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మెక్సికో సిటీ మేయర్ క్లాడియో షైన్బమ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఓవర్ పాస్ నిర్మాణంలో లోపభూయిష్టత కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికో విదేశీ వ్యవహారాల మంత్రి మార్సెలో ఎబ్రాడ్ గతంలో నగర మేయర్ గా ఉన్న సమయంలో ఈ ఓవర్ పాస్ నిర్మించారు. దీంతో ఆయన హయాంలో నిర్మించిన ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఆయనపై విమర్శలు తీవ్రమయ్యాయి.

ఇదిలా వుండగా కొద్దిసేపటి క్రితం మృతదేహాల వెలికితీత, క్షతగాత్రుల కోసం జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. ప్రమాదం సంభవించిన మెట్రో పాస్ ఓవర్ మార్గంలో మరిన్ని మెట్రో రైళ్లు వచ్చి కింద రోడ్డుపై పడే ప్రమాదముందని అధికారులు సహాయక చర్యలకు కొంత విరామం ప్రకటించారు. రోడ్డుపై కార్లు, ఇతర వాహనాల రద్దీ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో అనేక మంది అసువులు బాసారు. ఒక్కసారిగా పాస్ ఓవర్ పై నుంచి వెళ్తున్న ట్రెయిన్ కారు పాస్ ఓవర్ ను చీల్చుకుంటూ కిందకు దూసుకువచ్చి రోడ్డుపై పడిన వీడియో ఎంతో భయకంపితంగా వుంది. దీనిని మెక్సీకోలోని స్థానిక టీవీ ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles