Fire accident at Tirumala Asthana mandapam తిరుమల కొండపై అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

Fire accident at tirumala asthana mandapam shopkeeper burnt alive

Tirumala Tirupati Devasthanam, TTD officials, TTD staff, TTD Asthana Mandapa, fire accident in tirumala, fire tenders, shop-keeper burnt alive tirumala, Tirumala, fire accident, shop number 84, shop keeper, burnt alive, TTD, Tirumala crime, Tirumala police, ttd video viral, ttd videos viral, crime

Tirumala Tirupati Devasthanam officials and staff rushed to the Asthana Mandapam where the fire accident had taken place. Fire tenders found a dead body of a shop-keeper at shop number 84, who had been dead in fire accident.

తిరుమల కొండపై అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం

Posted: 05/04/2021 01:38 PM IST
Fire accident at tirumala asthana mandapam shopkeeper burnt alive

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి కొండపై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక దుకాణదారుడు సజీవదహనమయ్యారు. హిందూభక్తుల ఇలవేల్పుగా కొంగుబంగారమైన భూమిపై వెలసిన వైకుంఠంపై అపశృతి చోటుచేసుకుంది. కరోనా రెండో దశ నేపథ్యంలో తక్కువ సంఖ్యలో భక్తులు కొండపై వుండటంతో ఉపద్రవం తప్పింది. తిరుమలలోని ఆస్థాన మండపం సమీపంలో వున్న దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, మంటల ధాటికి 8 దుకాణాలు దగ్ధం అయ్యాయి. అసలే అరకొర భక్తులతో గిరాకీ లేక.. నష్టాలను చవిచూస్తున్న దుకాణాదారులకు అగ్నిప్రమాదం తేరుకోని నష్టాన్ని మిగిల్చింది.

ఇదిలావుండగా, అస్థానం వద్ద నున్న దుకాణం నెంబరు 84 నుంచి శకలాలు తొలగిస్తుండగా కాలిన మృతదేహం బయటపడింది. అది అదే దుకాణానికి చెందిన దుకాణాదారుడిదని ఇరుగుపోరుగు దుకాణాదారులు గుర్తించారు. కాగా, ఈ దుకాణంలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దుకాణాదారుడు సజీవ దహనం అయ్యాడా.? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అగ్నిమాపక బృందాలు ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో తిరుమల వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  fire accident  shop number 84  shop keeper  burnt alive  TTD  Tirumala crime  Tirumala police  

Other Articles