I am not scared of arrest, says Eatala Rajender ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్దం: ఈటెల

Eatala rajender says he is ready to resign for the post of mla

CM KCR, Etala Rajender, Assigned land, MLA Resignation, Achampeta, Hakimpet, Masaipeta Mandal, Medak, Vigilence DG, Purnachander Rao, Dharma Reddy, Nagesh, Harish Rao, MP Prabhakar Reddy, Narsapur MLA Madan Reddy, chief secretary Somesh Kumar, Medak collector Harish, district officials, Crime

Telangana Health Minister Etela Rajender was stripped of his portfolio over the alleged complaints of encroachments of lands on the outskirts of Achampet in Masaipet Mandal in Medak district. In a Press Meet, the former Health and Family Welfare Minister has alleged that for the last three days, a conspiracy was hatched against him to malign his image in the alleged land grabbing allegations.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్దం: ఈటెల

Posted: 05/03/2021 09:40 PM IST
Eatala rajender says he is ready to resign for the post of mla

ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన దేశంలోని ఏ ప్రభుత్వమైనా చట్టబద్దంగా పనులు చేయాల్సి వుంటుంది కానీ.. అధికారులు ఏకపక్షంగా భారీ పోలీసుల పహారా మధ్య తన సతీమణి, తనయుడికి చెందిన హేచరీస్ లో 66 ఏకరాల అసైన్డ్ భూమి ఉందని తేల్చడం హాస్యాస్పదమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తనకు కేసీఆర్ తో వున్న అవినాభావ సంబంధం గురించి తెలుసునని, ఎవరిపైన అయినా ఆయన గురిపెడితే వారిని ఖతం చేసేదాకా అయన పంతాన్ని వీడరని అన్నారు. ఇవాళ తనకు అదే పరిస్థితిని తీసుకువచ్చేందుకు అదే పంథా కొనసాగుతుందని అన్నారు.

తన అసైన్డ్ భూముల వ్యవహారం అంతా కుట్రపూరితంగానే సాగిందని, తన భూమిలో అసైన్డ్ భూమి వుందని గత రెండు మూడు రోజులుగా అధికార పార్టీ.. తమకు చెందిన పత్రికలలో కథలు కథలుగా రాయిస్తోందని, ఎండకాలంలో దాహమేసి నీరు తాగినా.. నీరు అమ్ముతున్నాడన్నట్లుగా మీడియా కథనాలను రాసిందని అవేదనను వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలోని నా తమ్ముడు అని చెప్పుకున్న అధినేతకు తాను ఇప్పుడు ఎందుకు దెయ్యంగా కనిపిస్తున్నాడని ఈటెల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు పార్టీ అధినేత బాటలో కలిసి తిరిగిన తాను అప్పుడు అచరించని అవినీతి, ప్రలోభాలకు ఇప్పుడెలా లొంగుతానని భావిస్తున్నారని ఈటెల నిలదీశారు.

అయితే తన హాచరీస్ కు పొడిగించే క్రమంలో రోడ్డును విస్తరించాగా అందులో కొంత అసైన్డ్ భూమి కలిసిందని ఆయన అన్నారు. అయితే ఎన్ని గ్రామాల రోడ్డులకు, ఎన్ని పరిశ్రమల రోడ్డులకు, అసైన్డ్ భూముల్లోంచి దారి నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. తనకు ఉద్వాసన పలికే చర్యలకు శ్రీకారం చుట్టిన తరువాత కుట్రపూరితంగా తనను తప్పించారే తప్ప ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. తన భార్య జమున, తన కుమారుడు చేస్తున్న వ్యాపారంలో తనను మంత్రివర్గం నుంచి తొలగించడం ఎలా నిర్ణయమో.. ఇది పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ఇక తన హేచరిస్ లో అసైన్డ్ భూమి వుందన్న అరోపణలపై విచారణ జరపాలంటే చట్ట ప్రకారం విధివిధానాలు వేరుగా వుంటాయని ఈటెల తెలిపారు. జిల్లాకు చెందిన ఈడి సర్వే విభాగంలో పిర్యాదు చేస్తే వారు తనతో పాటు చుట్టుపక్కల వున్న రైతులను కూడా పిలిచి.. పంచుల సమక్షంలో సర్వే చేస్తారని అన్నారు. ఇక నాలా టాక్స్ పౌల్ట్రీలకు వుండదని, అది కూడా వ్యవసాయ అనుబంధం కిందకే వస్తుందని అన్నారు. అయితే చట్ట ప్రకారం కాకుండా సీఎం అదేశంతో ఆయన చెప్పినట్లుగానే వినే అధికారులు, అయన రాసించ్చిందే చదివి వినిపించినట్లుగా నివేదిక వుందని ఈటెల రాజేందర్ అరోపించారు.

తాను అరెస్టుల‌కు, కేసుల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదని,  త‌న‌ ఇంటి చుట్టూ వంద‌ల మంది పోలీసుల‌ను పెట్టారని చెప్పారు. ఎంత పెద్ద కేసుల‌యినా పెట్టుకోండ‌ని, తాను న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తాన‌ని చెప్పారు. భూములను కాజేశానంటూ వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపిన క‌లెక్ట‌ర్ నివేదిక త‌మ‌కు అంద‌లేదని తెలిపారు. త‌మ‌ వివ‌ర‌ణ కూడా అధికారులు అడ‌గ‌లేదని అన్నారు. వ్య‌క్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్య‌వ‌స్థ‌లు మాత్రం శాశ్వ‌తమ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం నుంచి తాను ఐదు పైస‌ల సాయం కూడా తీసుకోలేదని, అలాగే ఐదు కుంట‌ల భూమిని కూడా పొంద‌లేదని చెప్పారు.

ఇవాళ మంత్రి పదవి నుంచి తప్పించిన పెద్దలు రేపు మా పార్టీ గుర్తుపైనే గెలిచారని కూడా ప్రచారం చేసుకుంటారని, అందుకని రాజీనామా చేసి మాట్లాడమని కూడా అంటారని, అయితే పార్టీ బీ-ఫామ్ ఇచ్చిన ప్రతీ వ్యక్తి గెలవరని, అయినా తాను కారు గుర్తుపైనే గెలిచానన్న అపవాదుకు దూరంగా వుండాలని భావిస్తున్నానని, అందుకోసం ఎమ్మెల్యే పదవికి కూడా త్వరలోనే రాజీనామా చేస్తున్నానని ఈటెల ప్రకటించారు. హుజూరబాద్ ప్రజల ప్రేమాభిమానాలు మెండుగా వున్న తాను.. వారితోనే కలసి తన భవిష్యత్ కార్యచరణపై చర్చించి తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Etala Rajender  Assigned land  MLA Resignation  Achampeta  Hakimpet  Land Encroachment  Telangana  crime  

Other Articles