Consider lockdown to curb spread of Covid: SC లాక్ డౌన్ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించిన 'సుప్రీం'

Consider imposing lockdown to control second wave of covid supreme court

lockdown india, covid lockdown, corona lockdown, supreme court lockdown, states lockdown, centre lockdown, people on lockdown, Supreme court directions on lockdown, supreme court urges lockdown, Supreme court ot centre and states on lockdown, corona second wave, coronavirus, covid-19

The Supreme Court of India advised the central and state governments to consider a lockdown to break the chain of Covid transmission. The country's top court passed an order in this regard after hearing from officials over measures being taken to counter the second wave of the pandemic.

లాక్ డౌన్ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించిన ‘సుప్రీం’

Posted: 05/03/2021 07:27 PM IST
Consider imposing lockdown to control second wave of covid supreme court

కరోనావైరస్ సెకెండ్ వేవ్ ఉద్దృతంగా తన ప్రభావాన్ని కొనసాగిస్తూ ప్రతి రోజు వేలాధి మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో లాక్ డౌన్ వింధించే అంశాన్ని పరిశీలించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా రెండవ దశ శరవేగంగా విస్తరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని తన కబంధహస్తాల్లోకి తీసుకుంటున్న క్రమంలో తక్షణం ప్రజారోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగూణంగా మరోమారు దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల పరిధిలో లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచనలు చేసింది.

ఇందులో భాగంగా ప్రజలు అధికంగా గుమికూడే అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేయాలని పేర్కోంది. "మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నాం. వైరస్ వ్యాపించే అవకాశాలున్న అన్ని రకాల కార్యక్రమాలనూ రద్దు చేయండి. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించండి" అని అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యానించింది. లాక్ డౌన్ ను మరోసారి విధించాలని నిర్ణయిస్తే, ప్రభావితం చెందే పేద ప్రజలకు ఆహారాన్ని అందించి, వారి అవసరాలను తీర్చే దిశగా ముందస్తుగానే ప్రణాళికలను రూపొందించుకోవాలని ధర్మాసనం సూచించింది.

కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల రికార్డులను అందించాలని ఆదేశించింది. కరోనా నియంత్రణపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఏ ఒక్క కరోనా బాధితుడికి కూడా ఆసుపత్రిలో పడక లేదని చెప్పకుండా చూసుకోవాలని, అత్యవసరమైన ఔషధాలను అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బాధితుడు ఏ ప్రాంతం వాడైనా, స్థానికంగా నివాసం లేకున్నా, గుర్తింపు కార్డును చూపించకున్నా అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles