Former MP Sabbam Hari dies of Covid-19 మాజీ ఎంపీ, సీనియర్ నేత సబ్బంహరి ఇకలేరు

Tdp senior leader former mp sabbam hari passes away

Sabbam Hari, coronavirus, Senior TDP leader, congress, Visakha yuvajana congress leader, Visakhapatnam Mayor, Anakapally MP, YS Rajashekar Reddy, Visakhapatnam, COVID-19 Demise, Chandrababu, Nara Lokesh, Andhra Pradesh, Politics

Former Member of Parliament Sabbam Hari of Anakapalle died of coronavirus disease here on Monday. He was 68 and is survived by two daughters and son. Hari was under home quarantine after contacting the disease on April 15. He was later admitted to a private hospital on the advice of doctors.

మాజీ ఎంపీ, సీనియర్ నేత సబ్బంహరి ఇకలేరు

Posted: 05/03/2021 06:57 PM IST
Tdp senior leader former mp sabbam hari passes away

రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) కన్నుమూశారు. మాయదారి కరోనా మహమ్మారి సోకడంతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న సబ్బం హరి ఆయన 1952లో జూన్ 1వ తేదీన తగరపువలసలో జన్మించారు.

తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించిన హరి.. 1985లో విశాఖ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత విశాఖ మేయర్ గానూ ఎన్నికై ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం చూపారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీలో చేరిన ఆయన భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

అప్పట్లో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఓ దశలో ఓదార్పు యాత్రలో జగన్ వెంటే నడిచారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను రాజకీయాలకు దూరం చేశాయి. ఆపై టీడీపీలో చేరారు. కొన్నివారాల కిందట కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కానీ చికిత్స పొందుతుండగా, ఇటీవల పరిస్థితి విషమించింది. అప్పటినుంచి ఆరోగ్యం మరింత క్షీణించి ఇవాళ మధ్యాహ్నం ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles