Truck with Covid vaccine doses found abandoned కలకలం: రోడ్డు పక్కన కరోనా వాక్సీన్ కంటైనర్

Truck with over 2 lakh covid 19 vaccine doses found abandoned by roadside

Coronavirus vaccine, Coronavirus vaccine update, Coronavirus vaccine in India, Coronavirus, COVID-19 vaccine, Truck found with Covid vaccine doses, truck abandoned roadside with corona vaccine, Kaleri bus stand, Narsinghpur district, Madhya Pradesh, COVID19 vaccine, COVID19 vaccine news, COVID19 vaccine India, truck abandoned, corona vaccine truck, Kaleri bus stand, Madhya Pradesh

A truck carrying over two lakh Covid-19 vaccines was found abandoned by the roadside near Kareli Bus Stand in Narsinghpur district of Madhya Pradesh on Saturday, police said. The truck was loaded with as many as 2,40,000 doses of Covaxin, they added.

కలకలం: రోడ్డు పక్కన కరోనా వాక్సీన్ కంటైనర్.. అందులో 2.4లక్షల డోసులు..

Posted: 05/01/2021 02:27 PM IST
Truck with over 2 lakh covid 19 vaccine doses found abandoned by roadside

యావత్ ప్రపంచ మానవాళిపై ప్రభావం చేపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే తమ దేశపౌరులకు వాక్సీన్ ను అందిస్తున్నాయి. దీంతో కరోనా నియంత్రణ చేపట్టవచ్చని దశలవారీగా వాక్సీన్ ను అందిస్తున్నాయి. అయితే ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వయస్సు వారందరికీ వాక్సీన్ అందించాలని అటు కేంద్రం నిర్ణయించగా, అందుకు గాను రాష్ట్రాలను వాక్సీన్ అయ్యే ఖర్చును చెల్లిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలోని ప్రజలకు అవసరమయ్యే వాక్సీన్ మొత్తానికయ్యే ఖర్చును ఒక్క  చెక్కుతో చెల్లిస్తామని కూడా అన్నారు. అయినా భారత్ లో అభివృద్ధి చెందుతున్న కరోనా వ్యాక్సిన్లు మాత్రం ప్రజలందరికీ అవసరమయ్యే స్థాయిలో ఉత్పత్తి చెందడం లేదన్న విషయం తెలిసిందే.

ఇక ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలందరికీ వాక్సీన్ వేసుకునే వెసలుబాటు కల్పించడంతో రాష్ట్రాలన్నీ అందుకు తగిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్రం వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే వాక్సీన్ల కొరతతో టీకాలు అందక ప్రజలు అరోగ్య కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంకాలం వరకు పడిగాపులు కాస్తూ టీకాలు వేయించుకుంటున్నారు. అయినా కొరత కారణంగా అనేక మందికి టీకాలు అందక సతమతమవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు తాండవిస్తున్న వేళ మధ్యప్రదేశ్ లో తీవ్ర కలకలం రేగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల నలబై వేల కరోనా టీకాలను తరలిస్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లడమే అందుకు కారణం.

నర్సింగ్ పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరేలీ ప్రాంతంలో బస్టాండ్‌కు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్కును తెరిచి చూడగా.. అందులో దాదాపు 2,40,000 డోసుల కొవాగ్జిన్‌ టీకాలు కన్పించాయి.ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్‌ మొబైల్‌ లోకేషన్‌ను ట్రేస్‌ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులోని ఎయిర్ కండిషన్‌ పనిచేస్తుందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 8కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles