TDP Party Sensational Decision on Parishat Election పరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం

Tdp party sensational decision on zptc mptc election

Telugu desam party, TDP to boycott parishat elections, TDP to quit from parishat elections, YSRCP, Parishat Elections, MPTC, ZPTC elections, Andhra Pradesh, Politics

Andhra pradesh opposition party Telugu Desam Party takes Sensation decision on Parishat Elections in the State. Party leaders says even at the time of nimmagadda ramesh the ruling party had done what not to make their party win.

పరిషత్ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం

Posted: 04/01/2021 08:28 PM IST
Tdp party sensational decision on zptc mptc election

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ససేమిరా అన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్ణయంపై అటు హైకోర్టులో సవాల్ చేసి.. చివరాఖరున ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్తులు అధికశాతం  స్థానాలను కైవసం చేసుకున్నారన్న ఊపుతో వెంటనే వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలలోనూ తమ సత్తాను చాటుకుంది అధికార పార్టీ. ఇక ఆలస్యం చేయకుండా పరిషత్ ఎన్నికలను కూడా కానిచ్చేద్దామని అనుకుంటే ఈ లోపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేశారు.

దీంతో రాష్ట్ర నూతన ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోఅమె వచ్చిన వెంటనే పరిషత్ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తాయంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఎస్‌ఈసీ నీలం సాహ్ని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ అంటోంది. నిష్పక్షపాతంగా జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి (ఎస్‌ఈసీ)గా భాద్యతలు చేపట్టిన నీలం సాహ్ని స్పీడు పెంచారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్  హాజరైనారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్ని ఆదేశించారు. జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై వివరాలు అడిగి ఎస్ఈసీ తెలుసుకున్నారు. శుక్రవాంర రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశంకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu desam party  TDP  YSRCP  Parishat Elections  MPTC  ZPTC elections  Andhra Pradesh  Politics  

Other Articles