మాములు అన్ని జాగ్రాత్తలు తెలిసి.. ట్రాఫిక్ రూల్స్ గురించి చిన్పప్పటి నుంచి ఫాలో అవుతున్న మనుషులకే రద్దీగా వుండే రోడ్డును దాటాలంటేనే చాలా కష్టం. ఇక చిన్నారులున్న తల్లి రోడ్డు దాటడం అంటే ఓ గగనమే. ఒక్క తుంటరి చిన్నారి వుంటే ఇక ఆ తల్లి పాట్లు చెప్పనలవి కాదు. కానీ నలుగురు చిన్నారులు అందులో ఇద్దరు చలాకీలు కాగా ఇద్దరు బయస్థులు అయితే.. ఆ నలుగురితో రద్దీ రోడ్డును దాటాల్సి వస్తే.. ఆ తల్లి బాధ వర్ణణానీతం. ఇక ఆ తల్లి మాటలు వచ్చిన మనుషులు కాకుండా భల్లూకమైతే.
దేవుడా తలచుకుంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చినా తన పిల్లలకు హాని చేసేందుకు వస్తున్నారని ఎటుగుబంటి ఏం చేస్తుందోనన్న భయం. ఈ భయాల మధ్య చేసేందేలేక.. తమ పనులను కదిలిపోతు్న కాలంలో కొన్న నిమిషాల పాటు తాత్కాలికంగా బ్రేక్ వేసుకోవడమే వారు చేయాల్సింది. ఏ వాహనం ఆ మార్గంలో రాకపోతే ఎలుగుబంటి తన పిలల్లతో మెల్లిగా రోడ్డు దాటి వెళ్లిపోతుంది. తీరా చూస్తే అక్కడి వారంతా అదే పని చేశారు. తమ తమ వాహనాలను అపేసి నిశబ్దంగా కూర్చున్నారు.
అయితే అలా ఆగినా వెనుక నుంచి ఏ వాహనం దూసుకొచ్చి గుద్దేస్తుందో అన్న అందోళన కూడా నెలకొనింది. ఈ విషయం తెలుసుకన్న పోలీసులు వచ్చి వాహనాలను ముందుకు కదలనీయకుండా నిలిపేశారు. తల్లి ఎలుగుబంటి తన నలుగురు పిల్లలతో రోడ్డు దాటేందుకు ఉపయుక్తం అయ్యింది. అయితే తన నలుగురి పిల్లలో ఇద్దరు పిల్లలు చలాకీగా తల్లిని అనుసరించేవి. అయితే మరో రెండు మాత్రం ఎక్కువగా భయపడుతున్నాయి. దీంతో ఇలా భయపడే ఓ పిల్లను తన నోటితో కరుచుకుని తల్లి ఎలుగుబండి రోడ్డును దాటేసి.. రక్షణ వున్న స్థలంలో దానిని విడిచిపెట్టింది.
తల్లిని వెంటన నడిచిన ఓ చలాకీ ఎలుగుబండి భయపడే పిల్లతో అక్కడే వుండిపోయింది. ఈ క్రమంలో మూడవ ఎలుగుబంటి పిల్ల కూడా రోడ్డును దాటేసి వచ్చింది. ఇలా ఒక పిల్ల మినహా అన్ని రోడ్డు దాటేయడంతో ఆ ఒక్క పిల్ల భయపడి చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది. వెంటనే వచ్చిన తల్తి దానిని కిందకు దింపు దానినిన నోట కరుచుకుని వెళ్లే ప్రయత్నం చేయగా, మూడు పిల్ల తల్లి వేంట మళ్లీ ఇటువైపు కువచ్చి.. ఈ రెండు పిల్లలు తల్లి ఎలుగుబండిని కాసింత మరాం చేశాయి. అయితే చివరకు భయపేడే పిల్లను తీసుకుని ఎటుగుబంటి రోడ్డును దాటేసింది.
అప్పుడే అక్కడి పోలీసు వాహనం కాసింత ముందుకు కదలడంతో ఎలుగుబంటి పిల్లులు మళ్లీ రోడ్డు పైకి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. ఇక తల్లితో కలసి అవి అడవిలోకి వెళ్లిపోయాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా.? అమెరికాలోని వించెస్టర్ నగరంలో. వించెస్టర్ సిటీ పోలీసులు తల్లి ఎలుగుబంటి నలుగురు పిల్లలను రోడ్డు దాటించేందుకు పడిన ప్రయాసను వీడియో చిత్రీకరించి వారి పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఓ తల్లి ఎలుగుబంటి నిత్యం బిజీగా ఉండే రోడ్డును దాటేందుకు అనేక ఇబ్బందులు పడింది. పిల్ల ఎలుగుబంట్లను నోటికి కరుచుకొని రోడ్డును దాటింది. ఎక్కడ పిల్లలను కార్లు గుద్దేస్తాయేమో అని భయపడుతూ రోడ్డును దాటిన దృశ్యాలను పోలీసులు తమ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more