Youth ends life after woman blackmails యువతి బ్లాక్ మెయిల్.. తనువు చాలించిన యువకుడు

Nizamabad youth ends life after woman blackmails him with his obscene videos

hyderabad hostel guy, You tube, obscene videos, blackmail, trapped, trapping messages, pesticide, private hospital, Nizamabad, Telangana, crime

A youngster committed suicide after a woman allegedly blackmailed him with his obscene videos and demanded money. The 22-year-old youth was pursuing studies and was staying at a private hostel in Hyderabad.

కిలాడి మాయలాడి బ్లాక్ మెయిల్.. తనువు చాలించిన యువకుడు

Posted: 04/01/2021 04:29 PM IST
Nizamabad youth ends life after woman blackmails him with his obscene videos

ఈజీ మనీ కోసం దిగజారిపోయే చర్యలకు పాల్పడుతున్న ఓ ముఠా ధనదాహాన్ని ఓ 22 ఏళ్ల యువకుడి నిండు ప్రాణం బలైంది. వక్రమార్గంలో మనీ సంపాదించి.. జల్సాలకు వినియోగించే ముఠాలు మాటువేసివున్న ఈ సాంకేతిక విప్లవ రోజుల్లో అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిందేనని హెచ్చరిస్తున్న ఘటన ఇది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అడ్డదారుల్లో డబ్బులు లాగేందుకు గుంటనక్కలాంటి ముఠాలు గొతికాడి నక్కల్లా కాచుకుంటాయి. అలాంటి ముఠా చేతితో చిక్కిన నిజామాబాద్ యువకుడు.. తన ఆశయాలు నాశనం అయ్యాయని, తన వాళ్లు తనపై పెట్టకున్న ఆశలన్ని అడియాశలయ్యాయని ముఠా వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

యువతి మత్తెక్కించే మాటలు.. ఆన్ లైన్లో పరిచయం అయిన కొద్ది రోజులకే యువకుడ్ని చిత్తు చేసి తన మైకం మత్తు కప్పింది. అంతే ఎప్పుడెప్పుడు అమె నుంచి ఫోన్ వస్తుందా.? అంటూ నిరీక్షించడమే యువకుడికి పెద్ద పనైపోయింది. ఒక అమె నుంచి అనుకోకుండా ఓ రోజు రాత్రి వేళలో ఫోన్ వచ్చింది. అంతే హాస్టల్ గదిలోకి వెళ్లిన యువకుడు ఆ ఫోన్ లిప్ట్ చేయగానే అది కాస్తా వీడియో కాల్. వామ్మో అని అనుకుంటున్నతరుణంలోనే యువతి తన ఒంటిపైనున్న దుస్తులు విప్పేసి నగ్నంగా తయారైంది.

ఈ చర్యలతో షాక్ తిన్న యువకుడు ఏంటిది అని అడిగేలోపు.. అతన్ని కూడా అలాగే తయారు కావాలని కోరింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. యువకుడు పూర్తి నగ్నంగా మారిన వీడియోతో పాటు యువతితో చేసిన పూర్తి సంబాషణను రికార్డు చేసిన యువతి.. తన ముఠాకు అప్పగించింది. అంతే అటు యువతి, ఇటు యువతి ముఠా నుంచి తరచూ పోన్లురావడంతో ప్రారంభమయ్యాయి. అందరూ డిమాండ్ చేసింది డబ్బులే. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామంటూ ముఠా సభ్యులు యువకుడిని బెదిరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు తన స్నేహితుల నుంచి తీసుకున్న మొత్తంగా రూ. 24 వేలను వారికి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో చేసేది లేక తన ఆశయాలకు చెదులు పట్టిందని, తనవారు తనపై పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయని భావించి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తన తల్తిదండ్రులను కళ్లారా చూశాడు. తనను క్షమించాలని తన మనస్సులోనే వేడుకున్నాడు. ఎక్కడ తన వీడియోను యువతి ముఠా నెట్టింట్లో పెడుతుందోనన్న భయంతో ఆ తర్వాతి రోజు ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

పొలానికి కొంత ఆలస్యంగా వచ్చిన వారి తల్లిదండ్రులు తమ చేతికందిన బిడ్డ అచేతనంగా మారడాన్ని గమనించి వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యువకుడి మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతితక విప్లవంతో అరచేతిలో ప్రపంచం వుందని భ్రమల్లో బతుకుతున్న యువత.. ఆదమరిస్తే అంతేసంగతులన్న విషయం కూడా తెలుసుకోవాల్సిందే. అనుకోకుండా వచ్చిన ఓ సందేశం.. ఏమీ కాదులే అని క్లిక్ చేస్తే.. డబ్బులు పోవచ్చు లేదా ప్రాణమే పోవచ్చు.. తస్మాత్ జాగ్రత్తా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad hostel guy  You tube  obscene videos  blackmail  trapped  pesticide  Nizamabad  Telangana  crime  

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh