Woman's lawyer hits out at CM's stand on Ramesh Jarkiholi సిట్ విచారణలో సలు విషయాలను వెల్లడించిన బాధితురాలు

Karnataka sex for job case woman s lawyer hits out at cm s stand on ramesh jarkiholi

Sex scandal, Ramesh Jarkiholi, Jagadesh KN Mahadev, BS. Yediyurappa, election campaign, Third Video, FIR filed against former Minister Ramesh Jarkiholi, Ramesh Jarkiholi Sex scandal, Cubbon Park Police Station, lawyer Jagadish Kumar, Karnataka, Crime, Politics

Jagadesh KN Mahadev, the legal counsel of the woman involved in the sexual assault case against Ramesh Jarkiholi on Wednesday said that Karnataka Chief Minister BS. Yediyurappa's open invitation to Jarkiholi for the election campaign is a reflection of how the Karnataka government wants to handle this case.

రాసలీలల సీడీ కేసు: సిట్ విచారణలో సలు విషయాలను వెల్లడించిన బాధితురాలు

Posted: 04/01/2021 12:00 PM IST
Karnataka sex for job case woman s lawyer hits out at cm s stand on ramesh jarkiholi

కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయనను త్వరలోనే అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ఓ వైపు వినిపిస్తుండగానే. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో 28 రోజుల అజ్ఞాతాన్ని వీడిన బాధిత యువతి అనేక నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులోని ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి పోందిన సిట్‌ పోలీసులు బాధితురాలని గత రెండు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే.

అయితే సెక్స్ ఫర్ జాబ్ స్కామ్ లో మంత్రి రమేశ్ జార్కిహోళితో అమె ఏకంతంగా గడిపిన సమయంలో ఆ వీడియోలను తానే స్వయంగా తీసానని బాధితురాలు సిట్ విచారణలో వెల్లడించింది. భవిష్యత్తులో ఆయన తనను వాడుకుని మోసం చేసిన క్రమంలో ఈ వీడియోలే తనకు ఆధారంగా నిలుస్తాయని తాను నమ్మి ఈ వీడీయోలను చిత్రకరించానని అమె పేర్కొంది. ఇక మంత్రి స్థానంలో వున్న వ్యక్తి మాటకే సమాజంలో విలువ అధికంగా వుంటుందని, తనకు ఉద్యోగం పెట్టించకుండా అసలు అమె ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అనే అవకాశాలు కూడా అధికంగా వున్నాయని అందుకనే కేవలం తనకు రక్షణగా, సాక్ష్యంగా, ఆధారంగా నిలుస్తాయనే ఆ వీడియోలను చిత్రీకరించినట్టు అమె తెలిపారు.  

ఇక మంత్రి రమేశ్ జార్కిహోళిని ఎలా కలిసింది.. అసలు ఆయనతో ఎలా పరిచయం అయ్యింది. ఆయన సెల్ ఫోన్ ను కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఎలా సేవ్ చేసుకున్న వివరాలను కూడా బాధితురాలు సిట్ విచారణలో తెలిపారు. కొంతకాలం క్రితం తాను శాసనసభకు వెళ్లిన సమయంలో మంత్రి రమేశ్ జార్కిహోళి కలిశారని, ఆ సమయంలో ఆయన తన మొబైల్ నంబర్ ను ఇవ్వగా, దాన్ని 'మల్లేశ్వరి పీజీ' అని తన మొబైల్ లో సేవ్ చేసుకున్నానని, రాసలీలల సీడీలోని బాధిత యువతి సిట్ అధికారుల విచారణలో పేర్కొంది.

ఆమెను భారీ బందోబస్తు మధ్య బౌరిగ్ హాస్పిటల్ కు తీసుకెళ్లి, కరోనా పరీక్షలు చేయించి, నెగటివ్ వచ్చిందని తేల్చుకుని, ఆపై సిట్ ఆఫీసులో అధికారులు విచారించారు. మంత్రి తనకు సహకరించాలని కోరారని, తమ ప్రాంతంలో బలమైన నేత కావడంతోనే ఏమీ చేయలేకపోయానని వెల్లడించిన ఆమె, రెండు మూడు సార్లు తనను ఆయన శారీరకంగా వాడుకున్నారని, ఎప్పటికైనా సాక్ష్యాలుగా పనికి వస్తాయన్న కోణంలో ఆలోచించి, తానే ఈ వీడియోలను తీశానని చెప్పారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, అయితే, క్లాస్ మేట్ శ్రవణ్ అనే వ్యక్తికి, నరేశ్ అనే మరో స్నేహితుడికి ఇచ్చానని, ఇంకో కాపీని దాచుకున్నానని ఆమె పేర్కొంది.

ఇదిలావుండగా, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్ మహదేవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు తన క్లయింట్ అయిన బాధితురాలు మాజీమంత్రి రమేశ్ జార్కిహోళి ఉద్యోగం పేరుతో తనను వాడుకుని మోసం చేశారన్న కేసు నమోదైన క్రమంలో.. ఆయన సహకారంలో ఉపఎన్నికలలో విజయం సాధించాలని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేయడం హేయకరమని న్యాయవాది విమర్శించారు. కర్ణాటకలో జరగుతున్న ఉపఎన్నికలలో రమేశ్ జార్కిహోళికి పలుకుబడి వున్న ప్రాంతం కావడం.. దాంతో సీఎం యడ్యూరప్ప ఆయనను కూడా వచ్చి ఎన్నికలలో ప్రచారం చేయాల్సిందిగా బహిరంగంగా ఆహ్వానించడమే ఇందుకు కారణమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles