SIT questions Ramesh Jarkiholi for over 5 hours రాసలీలల కేసులో మాజీమంత్రిని విచారించిన సిట్

Sex for job scandal sit questions ramesh jarkiholi for over five hours

Sex scandal, Ramesh Jarkiholi, Third Video, FIR filed against former Minister Ramesh Jarkiholi, Ramesh Jarkiholi Sex scandal, Cubbon Park Police Station, lawyer Jagadish Kumar, Karnataka, Crime, Politics

BJP MLA Ramesh Jarkiholi was questioned by Special Investigation Team (SIT) officials in connection the CD-gate controversy for more than four hours on Monday. It is learnt that Jarkiholi claimed he had no contact with the woman who has filed a complaint against him, while seeking time to answer some questions.

రాసలీలల సీడీ కేసు: మాజీమంత్రిని 5 గంటల పాటు విచారించిన సిట్

Posted: 03/30/2021 01:25 PM IST
Sex for job scandal sit questions ramesh jarkiholi for over five hours

కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) అధి్కారులు విచారించారు. ఇటీవల బాధితురాలి తరపున అమె తరపు న్యాయవాది బెంగళూరు కమీషనర్ కార్యాలయంలో మాజీ మంత్రిపై పిర్యాదు చేయడంతో.. కమీషనర్ అదేశాలతో మాజీమంత్రిపై కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఇక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు అందజేశారు.

పోలీసుల తాఖీదులు అందుకున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళిని క్రితం రోజున  అధికారులు 5 గంటల పాటు విచారించారు. స్థానిక అడిగొడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం ( ఎస్ఐటీ) సాంకేతిక విభాగం అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పెదవి విప్పలేదు. ఉదయం పది గంటల సమయంలో మడివాలాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి జార్కిహోళి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. ఆ తర్వాత వారిని వాహనంలో వదిలి ఆయన టెక్నికల్ వింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో బయటకు వచ్చారు.

విచారణలో తొలి గంట తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దీంతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, చివరి నాలుగు గంటలు మాత్రం ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పెదవి విప్పలేదని సమాచారం. విచారణ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు, సీడీలో కనిపించిన బాధిత యువతి నిన్న కోర్టుకు హాజరవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే, రాత్రి వరకు ఆమెకు కోర్టు నుంచి అనుమతి లభించలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles