Covid Vaccine for all above 45 years of age from April 1 ఇక 45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వాక్సీన్..!

Covid 19 vaccination people above 45 years can take vaccine from next month

corona virus deaths, coronavirus, corona second wave, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, COVID-19 vaccine, Coronavirus vaccine, Covishield, Covaxin, covid vaccine above 45, covid vaccine for above 45, prakash javadekar, above 45 covid vaccine,co win app

Starting from 1 April, people above 45 years old will be able to take vaccines against novel coronavirus, Union minister Prakash Javadekar announced. "We appeal that all above 45 should take the vaccine as early as possible that will provide them shield against Corona," Javadekar told.

ఏప్రీల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వాక్సీన్.!

Posted: 03/23/2021 06:05 PM IST
Covid 19 vaccination people above 45 years can take vaccine from next month

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత వేగంగా దేశప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేరువ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదివరకే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాను అందించిన ప్రభుత్వం ఆ తరువాత 60 ఏళ్లకు పైబడిన వయోవృద్దులతో పాటు 45 ఏళ్లు దాటిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకాను అందించింది. వారు కోవిన్ యాప్ లో డౌన్ లోడ్ చేసుకున్న తరువాత వారికి షెడ్యూల్ చేసిన సమయంలో వెళ్లి టీకాను తీసుకోవాల్సి వుంటుంది.

ఇక ఈ ప్రక్రియ కింద వయోవృద్దులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా కోవిడ్ టీకాను తీసుకునే వెసలుబాటు కల్పించింది కేంద్రం. దీంతో వీరంతా టీకా తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అర్హులైన వారు తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత లేదని జవదేకర్ వివరించారు.

మరోపక్క, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందారని వివరించారు. గత 24 గంటల్లో 32.54 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు జవదేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles