Covid second wave: Centre issues new guidelines కరోనా సెకండ్ వేవ్: కేంద్రం తాజా గైడ్ లైన్స్..

Centre issues new guidelines as second wave of covid looms

corona virus deaths, coronavirus, corona second wave, coronavirus pandemic, coronavirus scare, coronavirus updates, covid, covid 19 deaths, covid scare, COVID-19 vaccine, Coronavirus vaccine, Covishield, Covaxin, covid vaccine above 45, covid vaccine for above 45, prakash javadekar, above 45 covid vaccine,co win app

With India on the cusp of a second wave of COVID-19, the government on Tuesday announced fresh guidelines to tackle the pandemic, and urged states and Union territories to focus on testing, tracking and treating cases.

కరోనా సెకండ్ వేవ్: కేంద్రం తాజా గైడ్ లైన్స్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

Posted: 03/23/2021 07:12 PM IST
Centre issues new guidelines as second wave of covid looms

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి చాటుకుంటోంది. పాశ్చాత్య దేశాలలో ఇప్పటికే సెకెండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినా.. భారత్ లో మాత్రం ఇప్పటివరకు క్రమంగా తగ్గిన కరోనా.. తాజాగా విజృంభిస్తోంది. మహారాష్ట్ర మొదలుకుని పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఇలా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వరుసగా రెండవరోజు 40 వేలకు పైన కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కరోనాపై ఉద్ధృతిపై దృష్టి సారించిన కేంద్రం ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్‌, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది.

కేంద్రం మార్గదర్శకాలివే..

* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి.
* పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్ లోకి తరలించాలి. ఎవరెవర్ని కలిసారన్న ట్రేసింగ్‌ చేపట్టాలి.
* పాజిటివ్‌ కేసులను బట్టి కంటైన్ మెంట్ జోన్లను ప్రకటించాలి.
* కంటైన్మెంట్ జోన్ల  వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో పొందుపర్చి.. ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలి.
* బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి.
* మాస్కులు, సామాజికదూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అవసరమైతే జరిమానా విధించాలి.
* స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు.
* అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
* కంటోన్మెంట్‌ జోన్‌ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది.
* రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, హోటళ్లు, రెస్టారంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎస్‌ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
* ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona second wave  Centre  COVID  Guidelines  issues  Lockdowns  pandemic  States  UTs  Testing  tracking  treating  

Other Articles