అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పేట్రేగిపోతుంది. ఈ సంస్కృతిని అంతం చేయాలన్న పాలకుల నిర్ణయాలు.. గాలిమూటలుగానే మారుతున్నాయి. పది రోజుల వ్యవధిలో అగ్రరాజ్యంలో తుపాకీ కాల్పులుకు ఇరవై మంది బలయ్యారు. దాదాపు ఎనమిది రోజుల క్రితం షికాగో నగరంలో జరిగిన ఓ పార్టీలో తుపాకీ కాల్పులు చోటుచేసుకుని ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఆ వెంటనే రెండు రోజుల వ్యవధిలో అట్లాంటా పరిధిలోని మూడు మసాజ్ కేంద్రాలపై దాడి చేసిన అగంతకుడు తుపాకీ గుళ్లకు ఏకంగా ఏనమిది మంది అసువులు బాసారు.
ఇక తాజా ఘటనలో అమెరికాలోని కోలరాడో రాష్ట్రంలోని బాల్డర్ లో గుర్తుతెలియని అగంతకుడు ఓ స్థానిక సూపర్ మార్కెట్ లోకి చోరబడి అక్కడ షాపింగ్ చేస్తున్న కస్లమర్లపై విఛక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఏకంగా పది మంది మరణించారు. మృతులో ఒక పోలీసు అధికారి కూడా వున్నారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్ లోని వినియోగదారులు.. ప్రాణభయంతో ప్రాణలు గుప్పుట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా తుపాకీ కాల్పులలో గాయపడి రక్తమోడుతున్న అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలరాడోలోని బౌల్డర్ జిల్లాలో గల కింగ్ స్టాపర్స్ సూపర్ మార్కెట్ లోకి గుర్తుతెలియని అగంతకుడు చోరబడి అక్కడి కస్టమర్లపై విఛక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో బౌల్డర్ పోలీసు విభాగానికి చెందిన 51 ఏళ్ల పోలీసు అధికారి ఎరిక్ టాల్లీ కూడా మృతి చెందాడు. ఆయన 2010లో తమ విభాగంలో చేరారని పోలీసులు తెలిపారు. కాగా రక్తపు గాయాలైన ఓ అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకన్నామని తెలిపారు.
కాగా కాల్పులకు తెగబడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. అగంతకుడిని విచారించిన తరువాత ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కాగా మృతులు ఎంతమంది అన్న విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నామని.. ముందు మృతులను గుర్తించిన తరువాత వారి కుటుంబసభ్యులకు వారి సమాచారం అందించాల్సి వుంటుందని, ఈ క్రమంలో వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు వున్నారని తెలిపారు. ఆ తరువాతే వివరాలను వెల్లడిస్తామని బౌల్డర్ పోలీసులు తెలిపారు. ఇక దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more