30% Fitment Benifit For Telangana Govt Employees తెలంగాణలో 61 ఏళ్లకు పదవీ విరమణలు.. తక్షణం అమలు

Cm kcr announced 30 fitment benifit for telangana govt employees

Telangana CM, KCR, Telangana Assembly, Telangana Govt Employees, Telangana Teachers, Retirement age, Pesioners, Fitment Benifit, VAO, Vidya Volunteers, OutSourcing staff, HomeGuards, PRC, CM KCR, Telangana

Telangana Chief Minister Kalvakuntla ChandraShekar Rao announed new PRC for Government Employees, Teachers including VAO, Vidya Volunteers, OutSourcing staff, HomeGuards etc, by appoving 30 percent Fitment Benifit.

ఉద్యోగులపై వరాల జల్లు.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు

Posted: 03/22/2021 02:07 PM IST
Cm kcr announced 30 fitment benifit for telangana govt employees

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్నాళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వారిపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వంపై కాసింత ముభావంగా వున్న కొన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యయులందరినీ తనవైపు తిప్పుకునేందుకు ఆయన అసెంబ్లీనే వేదిక చేసుకుని వారిపై వరాలను కురిపించారు. పే రివిజన్ కమీషన్ (పీఆర్సీ)పై ప్రకటన చేసే క్రమంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఐదేళ్లకో పర్యాయం ప్రకటించే పీఆర్సీని ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి, శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేస్తూ.. ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ కల్సిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. కరోనా కారణంగా పీఆర్సీ ప్రకటన కొంత ఆలస్యమైందన్న ఆయన.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టకునే కమీషన్ నివేదిక అందించిందని తెలిపారు. కమీషన్ నివేదికను సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అద్యయనం చేసిందని, ఆ తరువాతే దానిపై అమోదాన్ని తెలుపి ఇవాళ ప్రకటిస్తున్నానని సీఎం తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పెనషనర్లు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులకు పీఆర్సీ వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ఫ్ ఉద్యోగులు, విద్యావాలెంటీర్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏ, వీఏవోలకు కూడా పీఆర్సీ అములు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో వారి పదవీ విరమణ పరమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కేసీఆర్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  Telangana Assembly  Govt Employees  Teachers  Retirement age  Fitment Benifit  PRC  

Other Articles