‘Change your mentality’, Navya Nanda suggests CM సీఎంకు రిప్డ్ జీన్స్ వసుకున్న ఫోటోతో నవ్యానంద బదులు.!

Navya nanda poses in ripped jeans in response to uttarakhand cm s remark

amitabh bachchan granddaughter, navya naveli nanda, Tirath Singh Rawat, Uttarakhand chief minister ripped jeans remark, gul panag, uttarakhand cm, navya naveli, navya nanda, amitabh bachchan granddaughter, uttarakhand cm ripped jeans, uttarakhand cm controversy, navya naveli, amitabh bachchan, navya nanda, india, crime

Megastar Amitabh Bachchan’s granddaughter Navya Nanda responded to Uttarakhand Chief Minister Tirath Singh Rawat’s remark about women wearing ripped jeans and the “example they set up before their children and the society.”

సీఎంకు రిప్డ్ జీన్స్ వసుకున్న ఫోటోతో నవ్యానంద బదులు.!

Posted: 03/18/2021 03:31 PM IST
Navya nanda poses in ripped jeans in response to uttarakhand cm s remark

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తీరథ్‌ సింగ్‌ రావత్‌.. ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయనకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలి నుంచే ధీటైన బదులు వచ్చింది. అయితే దీనిపై ఆయన ప్రతిస్పందించలేదు. అయినప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయనకు బిగ్ బి అమితాబ్ మనవరాలి నవ్యా నందా నుంచే తొలి పంచ్ పడటం కాస్త ఇబ్బందికర ఫరిణామాంగానే చెప్పుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలపై నవ్య నవేలి నందా అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంతటితో సరిపెట్టకుండా అమె ఏకంగా తాను రిప్ట్ జీన్స్ ధరించిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రిప్డ్ జీన్స్ వేసుకున్నందుకు తాను గర్వంగా ఫీలవుతానని కామెంట్ చేసింది. ఇక సీఎం తీరథ్ సింగ్ రావత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తమ వస్త్రాధారణ మార్చడానికి కంటే ముందు మీ అభిప్రాయాలు, అలోచనలు, అలోచనా విధానాలను మార్చుకోవాలని సూచించింది. ముఖ్యమంత్రి లాంటి ఉన్నత పదవిలో కొనసాగుతూ ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి సమాజంలోకి వెళ్లే సందేశాలు దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయని నవ్య నంద తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొంది.

ముఖ్యమంత్రి పదవిలో వున్న నేతకు తాను మరీ గట్టిగా బదులిచ్చానని భావించిందో ఏమో తెలియదు కానీ.. కొద్దిసేపటి తరువాత అమె తన ఇన్ స్టాగ్రామ్ పోస్టును డిలీట్ చేసింది. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహిళలు టోన్డ్‌ జీన్స్‌ ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని తీరథ్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై నవ్య నవేలి నందా ఇలా స్పందించారు. అయితే అసలు ఇంతకీ ముఖ్యమంత్రి రావత్ ఏమని అన్నారన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..  డెహ్రాడూన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యాలు చేశారు.

పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోని యువతపై ఎంతలా ప్రభావం చూపుతుందో అంటూ ఆయన తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ సంస్కృతిని ఎక్కువగా మహిళలను మార్చేస్ుతందని, అందులోనూ వస్త్రాధారణ విషయంలో చాలా అధికంగా వుందని అన్నారు. గత కొంతకాలం క్రితం ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్డ్‌ జీన్స్‌ ధరించిందని.. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని.. అలాగే ఆమె ఒక ఎన్జీవోని సైతం నడుపుతుందని.. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం మెస్సేజ్‌ ఇస్తుందని ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles