CID sleuths raids on Narayana offices and residence మాజీ మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయాలపై సీఐడీ దాడులు

After serving notices cid sleuths raids on former minister narayanas residence

Amaravati, Chandrababu, CID , K Narayana, Amaravati lands issue, CID raids on Narayana residence, CID raids on Narayana Offices, assigned lands, P. Narayana, Former Minister, Alla RamaKrishna Reddy, AP CID, Summons, Farmers agitations, Decentralisation, CRDA, State Assembly, YS Jagan, amaravati lands case, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Former Andhra Pradesh minister Narayana has received notices case of Amaravati assigned lands irregularities. CID officials who went to his residence in Hyderabad on Wednesday issued notices.

అసైన్డ్ భూముల కేసు: నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సీఐడీ సోదాలు

Posted: 03/17/2021 03:27 PM IST
After serving notices cid sleuths raids on former minister narayanas residence

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి. నారాయణ ఇళ్లు కార్యాలయాల్లో సిఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణ బంధువుల ఇళ్లలోనూ సిఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నారాయణకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ సహా మొత్తం పది ప్రాంతాల్లో సిఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.

ఇవాళ టీడీపీ సీనియర్ నేతకు నోటీసులు అందించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సిఐడీ అధికారులు.. ఆయన లేకపోవడంతో ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. నారాయణ ఇంటి గేటు వేసిన అధికారులు లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక అదే సమయంలో అటు విజయవాడలోనూ ఆయనకు చెందిన కార్యాలయాలపై సోదాలు నిర్వహిస్తున్నారు సిఐడీ అధికారులు. ఇటు తెలంగాణలోని హైదరాబాద్ లోనూ సిఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కూకట్ పల్లిలోని నారాయణ నివాసంలో సిఐడీ అధికారులు ఇవాళ నోటీసులు అందజేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందించారు. ఈ నోటీసులలో మాజీ మంత్రి నారాయణను తమ ఎదుట ఈ నెల 22న విజయవాడలోని షిఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరారు. సీఐడీ సైబర్ సెల్ విభాగం డీఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. అమరావతికి చెందిన అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కూడా అధికారులు ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా అదేశిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  P Narayana  CID Radis  Nellore  Hyderabad  Offices and Residence  AP CID  Andhra Pradesh  Politics  

Other Articles