Konda Vishveshwar Reddy to decide on Future soon భవిష్యత్ కార్యచరణ రెండు మూడు నెలల్లో: కొండా విశ్వేశ్వరరెడ్డి

Former mp konda vishveshwar reddy to decide on future within 2 3 months

Konda Vishweshwar Reddy distance congress, Richest Politician, 2019 Lok Sabha Elections, 2024 Parliament Elections, TRS, lok sabha, Konda Vishweshwar Reddy, Government, Congress, Chevella, Telangana, Politics

Prominent industrialist and former parliamentarian from Telangana, Konda Vishweshwar Reddy, resigned from the Congress, who represented Chevella parliamentary constituency in Ranga Reddy district close to Hyderabad, sent his resignation letter to TPCC president.

భవిష్యత్ కార్యచరణ రెండు మూడు నెలల్లో: కొండా విశ్వేశ్వరరెడ్డి

Posted: 03/17/2021 02:30 PM IST
Former mp konda vishveshwar reddy to decide on future within 2 3 months

దేశంలోనే అత్యంత సంపన్న పార్లమెంటు సభ్యుడిగా 2014 నుంచి 2019 వరకు కొనసాగిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన రాజీనామాతో నిన్నే కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన నిర్ణయం నిన్న బలం చేకూర్చినా.. ఇవాళ మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను తాను దూరం చేసుకుంటున్నానని ఆయన నిన్న ప్రకటించాగా.. ఇవాళ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోతున్నానని క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయాన్ని తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటీవలే చెప్పానని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని.. అందుకని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆయన కోరారని చెప్పారు. ఆయన మాటను గౌరవించిన తాను విషయాన్ని ఎవరికీ చెప్పలేదని అన్నారు. అయితే తాను కాంగ్రెస్ ను వీడుతున్న విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన భవిష్యత్ కార్యచరణ ఏమిటన్న విషయమై రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

వచ్చే రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తానని, మన ప్రాంత, రాష్ట్ర, దేశ అభివృద్దికి ప్రజల శ్రేయస్సు కోసం అందరితో చర్చించి.. సముచిత నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీని స్థాపించాలా.? లేక స్వతంత్రుడిగా కొనసాగాలా.? లేక ఇతర పార్టీలో చేరాలా అన్న విషయాలపై అందరితో కలసిచర్చించిన పిమ్మట నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అయితే తనతో రావాలని తాను ఎవరినీ ప్రేరేపించనని అన్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో వున్న కాంగ్రెస్ అభ్యర్ధులు చిన్నారెడ్డి, రాములు నాయక్ ఏమాత్రం నష్టం వాటిల్లకుండా తాను నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  lok sabha  Konda Vishweshwar Reddy  Government  Congress  Chevella  Telangana  Politics  

Other Articles