Amit Shah hatching conspiracy to harass us: Mamata Banerjee అమిత్ షా అధిపత్యమెందుకు.? ఈసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మమత..

Frustrated over poor turnout in poll rallies amit shah hatching conspiracy to harass us mamata banerjee

West Bengal Assembly Elections 2021, WB Assembly Elections 2021, Mamata Banerjee, Nandigram attack, TMC, BJP, Congress, West Bengal Assembly Election 2021, State election 2021, Director General of Police, DGP, Virendra, P Nirajnayan, Jawed Shamim, ADG (Law and Order), Jagmohan, Trinamool Congress, BJP, West Bengal, Politics

West Bengal Chief Minister Mamata Banerjee accused Union Home Minister Amit Shah of hatching a conspiracy to harass TMC leaders ahead of the assembly elections in the state and wondered whether the Election Commission is working as per his instructions.

అమిత్ షా అధిపత్యమెందుకు.? ఈసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మమత..

Posted: 03/17/2021 11:21 AM IST
Frustrated over poor turnout in poll rallies amit shah hatching conspiracy to harass us mamata banerjee

ఈశాన్య బారతదేశంలోని రెండు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగుతున్న ఎన్నికలలో బీజేపికి అస్సోం మినహా ఎక్కడ అధికారం అందివచ్చే అవకాశం మాత్రం లేదని ఇప్పటికే సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతంలోని కేంద్రపాలిత ప్రాంతంపై మాత్రమే గురిపెట్టిన బీజేపి.. ఈశాన్యభారతంలోని అస్సోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలను విరివిగా వినియోగించుకుని తమ అజమాయిషీ చెలాయిస్తోందని అరోపణలు వినబడుతున్నాయి.

అస్సోంలో తమ అధికారాన్ని తిరిగి చేపట్టాలని పావులు కదుపుతున్న బీజేపి.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం మమతా బెనర్జీని అష్టదిగ్భంధనం చేసేందుకు.. తమకు అధికారం దక్కేలా అన్ని అస్త్రశస్త్రాలను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమీషన్ ను కూడా తమ కనుసన్నల్లోనే నడిచేలా చర్యలు చేపడుతున్నారని.. అమిత్ షా చెప్పినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అరోపించారు. తనను అంతం చేయాలనే అమిత్ షా ప్రయత్నిస్తున్నారని అమె సంచలన అరోపణలు చేశారు. అందులో భాగంగానే.. షా అదేశాల మేరకు తన భద్రత డైరెక్టర్ వివేక్ సహాయ్ ను కూడా తొలగించారని అమె అన్నారు.

అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో నిర్వహిస్తున్న ర్యాలీలకు ప్రజలను నుంచి ప్రతికూల స్పందన వస్తోంది. కేవలం పార్టీ కార్యకర్తలు తప్ప.. పెద్దగా జనం ఎవరూ రావడం లేదు. నాయకులు డబ్బులిచ్చి కాస్తో.. కూస్తో జనాన్ని సమికరిస్తున్నా.. వారు అగ్రనేతల ప్రసంగాలు ప్రారంభమయ్యే సమయానికి వెళ్లిపోతున్నారు. దీంతో పాలుపోని అమిత్ షా.. కొల్ కతాలో కూర్చోని తనపై, తన పార్టీ నేతలపై కుట్రలు పన్నుతున్నారని అమె అరోపించారు. బంకురాలో నిన్న నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమె మాట్లాడుతూ ' ఎన్నికల కమిషన్ ను నేను ఒక్కటే అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ను ఎవరు నడిపిస్తున్నారు. అమిత్ షా నడిపిస్తున్నారా? లేక కమిషన్ నడిపిస్తోందా?‘ అని ప్రశ్నించారు. తాము ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికలను కోరుకుంటున్నామన్నారు.

‘అసలు ఎవరు అమిత్ షా? ఎన్నికల కమిషన్ ను నిర్దేశించేందుకు ఆయనెవరు? ఎన్నికల కమిషన్ విధుల్లో ఆయన జోక్యం చేసుకోవడమేంటీ..? అని ప్రశ్నించారు. ‘ ఎన్నికల కమీషన్ అంటే అన్ని పార్టీలను.. చివరకు స్వతంత్రులను కూడా ఒక మాదిరిగానే పరిగణించాలని.. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో ములాఖాత్ అయ్యి.. రాష్ట్రీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. తన సెక్యూరిటీ ఇన్చార్జి వివేక్ సహాయ్ ని కూడా తొలగించారని మండిపడ్డారు. వాళ్లకు ఏం కావాలి? వాళ్లు నన్ను చంపాలనుకుంటున్నారా?' అంటూ ఎలక్షన్ కమిషన్ ను, అమిత్ షాను ఉద్దేశించి మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మమత చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ జైన్ ఒక లేఖ ద్వారా తమ స్పందనను తెలియజేశారు. ముఖ్యమంత్రి మమత చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ర్యాలీలో మమత మాట్లాడిన మాటలను మీడియాలో తాము చూశామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో అనుకూలంగా వ్యవహరించదని చెప్పారు. పూర్తి పారదర్శకతతో విధులను నిర్వహిస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh