Woman screams in new paragliding viral video అలా ముందుకెళ్లిందో లేదో.. భయంతో కళ్లుమూసుకునే..

Woman screams in new paragliding viral video from himachal

viral videos, trending videos, viral, trending news, paragliding video, himachal, land kara de, land kara de man, viral paragliding video, new paragliding video, paragliding female version, paragliding, Khajjiar, Incredible Himalya, woman screaming, video viral, Viral Video, social media, HImachal pradesh

A new video has surfaced on the internet and it will remind you of the viral clip from two years ago. Incredible Himalya, a travel agency, posted a video of a woman screaming in sheer fright while paragliding and the clip has gone crazy viral on social media.

ITEMVIDEOS: అలా ముందుకెళ్లిందో లేదో.. భయంతో కళ్లుమూసుకునే..

Posted: 03/16/2021 08:56 PM IST
Woman screams in new paragliding viral video from himachal

హీరో విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం చూశారా.. చూడకపోయినా ఫర్వాలేదు. కనీసం ఆ చిత్రంలోని కామెడీ బిట్స్ చూసింటారు. అందులో బ్రహ్మానందం, హరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలితో కలసి బుల్లెట్ ట్రైయిన్ ఎక్కుతాడు. ఎక్కి.. రైలు కదిలేంత వరకు బాగానే వున్నా.. ఇంతలో తన వెనకాల వున్న వ్యక్తి చూసి అతడ్ని చూస్తే కదిలేలోపే చచ్చేట్టువున్నాడని కామెంట్ కూడా చేస్తాడు. అది చాలదన్నట్లు బోట్టు లేని ఆడాళ్లన్నా.. గట్స్ లేని మగాళ్లన్నా తనకు నచ్చదని భారీ డైలా

 
 
 
View this post on Instagram

A post shared by Incredible Himalya (@incredible_himalya)

గ్ కూడా చెబుతాడు.

రైలు కదలడం మొదలెట్టగానే అపండ్రోయ్.. అపండ్రోయ్ అంటూ అరుస్తూ తన అద్భుత నటనతో ప్రేక్షకులు కడుప్పుబ్బా నవ్విస్తాడు. సరిగ్గా అలాగే ఓ మహిళ హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయ పర్వాతాల అందాలను, సోగసులను చూసేందుకు వెళ్లింది. అయితే అమె ధైర్యంగానే వుంది. తన కళ్లెదుటే పలువురు హాయిగా ఎగురుకుంటూ పారాగ్లైడింగ్ చేస్తూ హిమాలయ పర్వతాల అందాలను వీక్షిస్తున్నారు. దాన్ని చూసి తాను అలా చేయాలని అనుకుంది. అంతే పారాగ్లైడింగ్‌ చేసేందుకు సిద్దమైంది. పారాగ్లైడింగ్ సిబ్బంది అమె ఒంటికి బెల్టులన్ని కట్టేసే.. ఇక ఎగిరేందుకు రెడీ అయ్యారు. అప్పటివరకు బాగనే వున్న మహిళ.. ఆతరువాత బ్రహ్మానందం కన్నా ఎక్కువగా నెటిజనులను నవ్విస్తోంది.

హిమచల్‌ ప్రదేశ్ ఖాజ్జర్‌ ప్రాంతంలో పారాగ్లైడింగ్‌ కు అంతా సిద్ధమైంది. ఎగిరేందుకు ముందుకు వస్తుండగానే అపండీ అపండీ అంటూ భయంతో అరిచేసింది. క్రమంగా వేగం పెరిగి, ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమహిళ వెంటనే కళ్ళుమూసుకుంది. తన వెనుక ఉన్న గైడ్‌ ఆమెకు ధైర్యం చెబుతున్నా.. వినిపించుకోకుండా కదిలించమాకు అంటూ వేడుకుంది. ఒక్కసారి తన కళ్ళుతెరచి కిందకు చూసింది. భయంతో వణికిపోయి ఇక కిందకు దిగేంత వరకు కళ్లు తెరవలేదు. కిందకు దింపడీ.. నన్ను వదిలేయండి . మెల్లగా పోనివ్వండి..కదలనివ్వకండీ అంటూ అరిచేసింది. ఈ వీడియోను ఇన్‌క్రెడెబుల్‌ హిమాలయా అనే ట్రావెల్‌ ఏజేన్సీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అదికాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles