Huge blasts in Equatorial Guinea kill many గినియా మిలటరీ క్యాంపులో భారీ పేలుళ్లు..

At least 20 dead 600 injured in equatorial guinea military camp explosions

Guinea, Guinea explosion, Guinea military explosion, Guinea military camp explosion, Guinea, blasts, aid, Health ministry,Guinea blast, Equatorial Guinea, Eqatorial, covid-19, President Teodoro Obiang Nguema, Crime

At least 20 people were killed and hundreds injured after four accidental explosions ripped through a military camp in Equatorial Guinea and obliterated neighbouring residential areas.

ITEMVIDEOS: ఈక్వటోరియల్ గినియా మిలటరీ క్యాంపులో భారీ పేలుళ్లు..

Posted: 03/08/2021 11:28 AM IST
At least 20 dead 600 injured in equatorial guinea military camp explosions

ఇక్వెటోరియల్‌ గినియా దేశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. మిలిటరీ క్యాంప్ లో ప్రమాదం చోటుచేసుకుని సంభవించిన పేలుళ్లలో 20 మంది వరకు మృత్యువాతపడగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. దేశ ఆర్థిక రాజధాని బాటాలోని కోమా న్కోయా సైనిక శిబిరం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నగరంలోని చాలా భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇక మరికొన్ని భవనాలు భారీ విస్పోటనం ధాటికి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ పేలుళ్లతో కోమా న్కోయా ప్రాంతమంతా దట్టమైన నల్లని పోగ అలుముకుంది.

ఆ ప్రాంతవాసులు ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని.. ఆ దేశ ఆరోగ్య శాఖ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇక కోమా న్కోయాతో పాటుగా బాటాలోని ఆస్పత్రుల్లో వద్ద భాయానక వాతావరణం అలుముకుంది. రుధిర గాయాలతో చికిత్స కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. చిన్నారులు, పెద్దలతో పాటు అనేక మంది క్షతగాత్రులను శిధిలాల కింద నుంచి అసుపత్రులకు తరలిస్తుండటంతో అక్కడంతా క్షతగాత్రులు, బంధవుల అర్తనాథాలతో విషాధకర వాతావరణం అలముకుంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఇక్వెటోరియల్‌ గినియా అధ్యక్షుడు ట్యొడొరో ఓబ్యాంగ్‌ గెమా వివరించారు. ‘కోమా సైనిక శిబిరానికి సమీపంలో రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలను దహనం చేపట్టగా.. మంటలు అదుపు తప్పి పేలుళ్లకు దారి తీసింది. సైనిక శిబిరంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన విభాగ ఇన్‌ఛార్జి నిర్లక్ష్యం కారణంగా నగరం ప్రమాదానికి గురైంది’అని ట్యొడొరో వివరించారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని ట్యొడొరో తెలిపారు. ప్రపంచదేశాలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.  

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది మరణించి ఉంటారని ఇక్వెటోరియల్‌ గినియా రక్షణ శాఖ వెల్లడించింది. మరో 600 మంది గాయపడి ఉంటారని పేర్కొంది. ఈ పేలుడు ధాటికి చాలా నివాసాలు నేలమట్టం అయ్యాయని తెలిపింది. బాటాలో సంభవించిన పేలుళ్ల పట్ల ఇక్వెటోరియల్‌ గినియాలోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guinea explosion  Guinea  blasts  aid  Health ministry  Guinea blast  Equatorial Guinea  Eqatorial  covid-19  

Other Articles