Balakrishna slaps photographer in Hindupur బాలకృష్ణ ఖాన్ బైరి.. హిందూపురం మున్సిపోరులో ఘటన

Tdp mla balakrishna slaps photographer in hindupur during election campaign

Tollywood actor, TDP MLA Nandamuri Balakrishna, photographer, municipal elections, Hindupur, Andhra Pradesh, Politics, Crime

Tollywood actor and TDP MLA Nandamuri Balakrishna got angry on a photographer for snapping his photos during a campaign for the TDP candidates ahead of municipal elections in Hindupur. He slapped the photographer twice for entering into a house and taking his photos. The MLA threatened him to delete the photos from his camera.

ITEMVIDEOS: బాలకృష్ణ ఖాన్ బైరి.. మళ్లీ బాదేసి వార్తల్లో నిలచిన ఎమ్మెల్యే

Posted: 03/06/2021 04:39 PM IST
Tdp mla balakrishna slaps photographer in hindupur during election campaign

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు బలం చేకూర్చారు. బాలకృష్ణ తనపై చేయిచేసుకున్నా మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అభిమానికి. ఇంత చిరాకు ఎందుకువచ్చిందో తెలియదు కానీ.. తన ప్రచారానికి జనం లేకపోవడం.. జనాన్ని సమీకరించడంలో టీడీపీ నియోజకవర్గ నేతలు విఫలం కావడమే కారణమని తెలుస్తోంది.

ఈ క్రమంలో 9వ వార్డులోకి ప్రచారం నిమిత్తం బయల్దేరిన బాలకృష్ణ.. ప్రచారం అనంతరం ఆయన 9వ వార్డు అభ్యర్థికి ఎన్నికల నేపథ్యంలో వారికి దిశానిర్ధేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో ముందుగానే మీడియా, ఫోటో, వీడియో గ్రాఫర్లకు స్టాప్ చేయాలని చెప్పిన బాలయ్యను.. ఓ ఫోటోగ్రాఫర్ మాత్రం పెడచెవిన పెట్టి.. షూట్ చేస్తునే వున్నాడు. దీంతో తాను చెప్పినా వినకుండా వీడియో తీసినందుకు టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన హిందూపురంలో శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా హిందూపురంలోని 9 వార్డులో అభ్యర్థి ఇంట్లో చోటుచేసుకుంది.

ఇది చూసి కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలయ్య.. అతనిపై చేయి చేసుకున్నారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్ గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్‌ చేయ్‌ అని మండిపడ్డారు. మరోవైపు బాలయ్య కోపాన్ని చూసిన టీడీపీ శ్రేణులంతా హడలెత్తిపోయారు. కాగా గత మూడు రోజులుగా హిందూపురంలో బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన మొదటిరోజు కూడా టీడీపీ నేతలపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles