"Not seditious to disagree with Govt:" Supreme Court ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం దేశద్రోహం కింద రాదు: సుప్రీం

Supreme court dismisses pil seeking action against farooq abdullah for views on article 370

Farooq Abdullah, sedition case, Central government, Jammu and Kashmir, Supreme Court, Justice Sanjay Kishan Kaul, Justice Hemant Gupta, Rajat Sharma, Dr. Neh Srivastava, publicity interest litigation, crime news,

Disagreeing with the views and policies of government will not attract the offence of sedition, the Supreme Court observed on Wednesday as it rejected a petition seeking action against former Jammu & Kashmir Chief Minister Farooq Abdullah for his views on abrogation on Article 370 of the Constitution

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం దేశద్రోహం కింద రాదు: సుప్రీం

Posted: 03/03/2021 06:03 PM IST
Supreme court dismisses pil seeking action against farooq abdullah for views on article 370

ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను వ్యతిరేకించడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం వినిపించడం, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపర్చడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూఖ్‌ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకించిన ఫరూఖ్‌ అబ్దుల్లా.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో సర్థార్ పటేల్ విశ్వగురు భారత్ విజన్ ట్రస్టు కార్యదర్శి రజత్ శర్మ, అతనికి తోడుగా డాక్టర్ నెహ్ శ్రీవాత్సవ్ లు అబ్దుల్లాపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించేందుకు అబ్దుల్లా.. చైనా, పాకిస్థాన్‌ సాయం తీసుకుంటూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని పిటిషనర్‌ ఆరోపించారు.

ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ అభిప్రాయాలను వ్యతిరేకించినంతమాత్రాన దేశ ద్రోహంగా పేర్కొనలేమని తెలిపింది. అబ్దుల్లాపై చేసిన ఆరోపణలను రుజువు చేయడంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి‌ విఫలమైనందున ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లతో ప్రెస్, మీడియాలో ప్రాచుర్యం పోందేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మసనంలోని న్యామమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కాంత్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా పిటిషనర్లకు రూ.50వేల జరిమానా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles