KTR hints at new law for lawyers’ safety న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం

Politicos using murder case for personal gain ktr on telangana lawyer couple death

KTR, VaniDevi, MLC election, TRS working president, PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

A fortnight after lawyer couple Gattu Vaman Rao and his wife PV Nagamani were murdered near Peddapalli, TRS working president KT Rama Rao said the state government will try to bring a new advocates’ protection Act for their safety. He said the government will study if there is any such Act in other states before bringing it here.

న్యాయవాదుల హత్యకేసు: పక్షం రోజుల తర్వాత స్పందించిన కేటీఆర్

Posted: 03/03/2021 03:28 PM IST
Politicos using murder case for personal gain ktr on telangana lawyer couple death

తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్యకేసులో ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలే వున్నారని అరోపణలు రావడంతో హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు అధికార పార్టీ అగ్రనేతలుమౌనంగా ప్రేక్షకుడిగా మారారు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఈ విషయంలో స్పందిస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్-హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సి స్థానానికి ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన ఇక్కడి నుంచి తమ అభ్యర్థి వాణిదేవిని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం కోసం కృషి చేస్తామని అన్నారు. న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక నేతను పార్టీ నుంచి తొలగించినట్టు చెప్పారు. హంతకులను వదిలిపెట్టబోమని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

న్యాయవాదుల హత్యకేసును కొందరు రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కేసు విషయంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలైన నిందితులకు మాత్రం శిక్ష పడక తప్పదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు లాఠీ దెబ్బలు తిన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కూడా ముఖ్యభూమిక పోషించారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, నల్ల చట్టాలను తెచ్చిందని  ఆరోపించారు. జీడీపీని పెంచుతామని పెట్రో, గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై గతంలో కాంగ్రెస్ ను తిట్టిన మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, తాము మాత్రం ఆయనను ఎంతగానో గౌరవిస్తున్నామని, ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చామని, న్యాయవాదులంతా ఆమెకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles