Monkeys batch at girls Junior college in Nizamabad అమ్మాయిల కాలేజీ వద్ద కోతుల బ్యాచ్.. క్లాస్ రూమ్ లోకి వెళ్లగానే..

Monkeys batch at girls junior college in kotagalli of nizamabad

Govt Junior College For Girls, Government Junior College For Girls in Kotagalli, Junior College for Girls kotagalli, Inter College for girls, kotagalli, forest officials, district collector, Nizamabad, Telangana

Monkeys harassing kotagally Girls Intermediate college students during classes, in spite of repeated requests from college management to the forest officials, they have not responded nor turned up to solve the issue.

అమ్మాయిల కాలేజీ వద్ద కోతుల బ్యాచ్.. క్లాస్ రూమ్ లోకి వెళ్లగానే..

Posted: 02/25/2021 06:31 PM IST
Monkeys batch at girls junior college in kotagalli of nizamabad

 అమ్మాయిల‌ కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్ పై అటు కాలేజీ యాజమాన్యం ఎన్నిమార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. చివరాఖరున జిల్లా కలెక్టరుకే కాలేజీ యాజమాన్యం పిర్యాదు చేయడానికి సిద్దమైంది. ఏమిటో బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్ లా ఈ కోతుల బ్యాచ్ అనుకుంటున్నారా.? అలాంటిదేమీ లేదండీ ఇది నిజంగా కోతుల బ్యాచ్చే.

లాక్ డౌన్ నాటి పరిస్థితులను అసరగా చేసుకుని ఎంతో ప్రశాంతంగా వున్న కాలేజీని.. అక్కడి చెట్లను అవాసంగా మలుచుకున్న వాన‌రాలు.. అన్ లాక్ తరువాత కాలేజీలు తెరుచుకున్నా తమ అవాసాన్ని మార్చుకోలేక.. అక్కడే తిష్టవేశాయి. అయితే పోనీలే మూగజీవాలు ఇక్కడే వున్నా పర్వాలేదు.. బుద్దిగా వుంటే అనుకుంటున్నారా.? అవి మనుషులు కావు.. కోతులు కాబట్టే బుద్దిగా ఉండకుండా పౌచులు, చున్నిలు ఎత్తుకెళ్తున్నాయి. అంతటితో ఆగకుండా విద్యార్థినులు టిఫిన్ బాక్స్ లను కూడా ఎత్తుకెళ్లి స్వాహా చేస్తున్నాయి.. దీంతో విద్యార్థినిలు త‌ర‌గ‌తి గ‌దిలో కూర్చునేందుకు బ‌య‌ప‌డుతున్నారు.

చ‌దువు మీద శ్రద వహించలేకపోవడంతో పాటు ఎప్పుడు, ఎటువైపు నుంచి కోతులు వ‌స్తాయో తెలియకుండా.. ఎక్కడా దాడి చేస్తాయోనన్న భయంతో విద్యార్థినులు జంకుతున్నారు. దీంతో వాన‌రాల నుంచి ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని కాలేజీ ప్రిన్సిప‌ల్ పిర్యాదు చేసిన అట‌విశాఖ అధికారులు స్పందిచలేదని కాలేజీ యాజమాన్యం అరోపించింది. దీంతో క‌లెక్ట‌ర్ కు పిర్యాదు చెశామని చెప్పింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరుగుతోందో తెలుసా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట‌గ‌ల్లి ప్రాంతంలోని ప్ర‌భుత్వ‌ బాలికల జూనియ‌ర్ కాలేజీలో విద్యార్థినులు కొతుల బెద‌డతో చదువుపై ద్యాస పెట్టలేకపోతున్నారు.

విద్యార్థులు కాలేజీ త‌ర‌గతి గ‌దిలోకి వెళ్లగానే ఇక వాటి ఆగడాలకు అంతులేకుండా పోతోందని విద్యార్థినులు బాధను వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలోని ఒక చోట నుంచి మరోచోటికి ఎగురుతూ, నడుస్తూ.. చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ల‌ను ఎత్తుకెళుతున్నాయి.. విద్యార్థుల పౌచులు, చున్నిల‌ను కూడా ఎత్తుకెళుతున్నాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయుల పిర్యాదులు ఎక్కువకావడంతో కాలేజీ ప్రిన్సిఫ‌ల్, లెక్చ‌ర‌ర్లు ఆట‌వి శాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేసారు. అయినా వారు ప‌ట్టించుకోలేదు. దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ సీ.నారాయాణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామ‌ని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles