Union Leader Asks Woman To satisfy his desire కార్మికుడి భార్యపై నేత లైంగిక వేధింపులు.. ఆడియో లీక్..

Singareni union leader asks woman to come home in husband s absence

singareni colories, singareni union leader, Gaddam Venkateshwarlu, Illendu, married woman, sexual harassment, audio leaked, Telangana police, bhadradri kothagudem, Telangana, Crime

A leader turned out to be a molester. He harassed the wife of his colleague by making phone calls asking to satisfy his desire. The victim, fed up with his harassment, complained to the police but was negligent in registering the case. However, the audio footage of the Union Leader talking to the woman has been leaked and is now going viral.

కార్మికుడి భార్యపై నేత లైంగిక వేధింపులు.. ఆడియో లీక్..

Posted: 02/25/2021 07:30 PM IST
Singareni union leader asks woman to come home in husband s absence

కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో కార్మికుడి భార్యపై కన్నెసి.. అమెను అనునిత్యం లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో అమె విషయాన్ని పోలీసులకు కూడా చేరవేసింది. పోలీసులు కేసు నమోదు చేసేందుకు సుముఖత చూపకపోవడంతో దారితప్పిన కార్మిక నేతను బుద్ది చెప్పాలనుకుంది. అంతే అతడి ఆడియోను లీక్ చేసింది. వెనువెంటనే అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియాలోని తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు తన కాలనీలోని మరో కార్మికుడి భార్యను కొద్దికాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ ఫోన్ చేసి.. తన కోరికలను తీర్చాలని కోరుతున్నాడు. నిత్యం తన కలలోకి వస్తున్నావ్.. వచ్చి ఏం చేస్తున్నావో చెప్పాలంటే మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి వస్తే చెబుతానని అంటున్నాడు. అసభ్యకర సైగలు చేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు.

నిందితుడి వేధింపులు భరించలేని బాధితురాలు అతడు తనతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణను వాయిస్ రికార్డు చేసింది. ఆ వెంటనే ఆధారాలతో సహా ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే నిందితుడ్ని పిలిచిన పోలీసులు అతడితో రాజీ కుదర్చారు. ఇకపై వేధింపులకు పాల్పడబోనని కార్మికనేత లిఖితపూర్వకంగా రాసివ్వడంతో విషయం సద్దుమణిగింది.

ఇదిలా ఉంటే సదరు నేతపై కేసు బనాయించకుండా అధికార పార్టీ అండదండలు కాపాడినా.. అతడికి మరింతగా బుద్ది చెప్పాలని భావించిన వివాహిత.. నిందితుడు తనతో మాట్లాడిని ఆడియోను నెట్టింట్లో లీక్ చేసింది. దీంతో అతడి బండారం బయటపడింది. అది కాస్తా నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు అఘమేఘాల మీద కార్మిక నేతపై కేసు నమోదు చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్పటి రమేష్ స్పందిస్తూ కార్మిక నేతపై మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles