కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. వైద్యుల కృషితో త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే చాలామంది వ్యాక్సిన్ మీద అపనమ్మకంతో వేసుకోవడానికి ముందుకురావడంలేదు. వైరస్‌కు విరుగుడుగా ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సి ఉండగా.. చాలామంది ఒక డోస్ మాత్రమే వేసుకొని, మరో డోసు వేసుకోవడంలేదు. అలాంటి వారితో రెండో డోసు కూడా వేయించాలనే ఉద్దేశంతో ఇజ్రాయేల్ దేశంలోని టెల్ అవీవ్ పట్టణంలో ఒక స్పెషల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆ దేశంలోని 9 మిలియన్ల జనాభాలో ఇప్పటివరకు 43 శాతానికి కన్నా ఎక్కువ మంది ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. కానీ, రెండో డోసు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. దాంతో టెల్ అవీవ్ మున్సిపాలిటీలోని జెనియా గ్యాస్ట్రోపబ్ అందరినీ ఆకట్టుకునే ఆఫర్‌ను పెట్టింది. ఎవరైతే రెండో వ్యాక్సిన్ వేసుకుంటారో వారికి తమ పబ్‌లో ఫ్రీ బీర్ ఇస్తామని ఆఫర్ పెట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని.. తమ దగ్గరే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కూడా ఉందని తెలిపింది.
ఇంకేముంది.. బీరు ప్రియులు ఆ పబ్ ముందు బారులు తీరారు. అటు వ్యాక్సిన్ వేయించుకోవచ్చే.. ఇటు బీరు తాగొచ్చు అని జనాలు వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. ‘టీకా వేసుకోవడానికి ఇది మంచి అవకాశం. నాకు వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడానికి టైం కుదరడంలేదు. అందుకే పబ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నా. అటు వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఇటు బీరు తాగాను’ అని మే పెరెజ్ అనే వ్యక్తి తెలిపాడు.
వ్యాక్సినేషన్ బార్ ఏర్పాటు చేయడంపై పబ్ యాజమాన్యం కూడా సంతోషంగా ఉంది. ‘కరోనా టైంలో పబ్‌లు, బార్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే బిజినెస్ ఊపందుకుంటుంది. పబ్లిక్‌ను ఆకర్షించడం కోసం ఈ ఆఫర్ పెట్టాం. అటు వ్యాక్సిన్ వేస్తూ కరోనాను నిర్మూలిస్తున్నాం.. అదే సమయంలో మా బిజినెస్ కూడా పెంచుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారికోసం నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్‌ను ఫ్రీగా అందిస్తున్నాం’ అని ఆ పబ్ ప్రతినిధి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more