Suspicious death of Chalasani Srinivas’s daughter చలసాని శ్రీనివాస్ కూతరు అనుమానాస్పద మృతి

Chalasani srinivas s daughter sirishma suspicious death

Andhra Intellectuals Forum, Chalasani Srinivas, Chalasani sirishma, suspicious death, Chalasani Srinivas daughter Suicide, Chalasani Srinivas daughter suspicious death, Interior designer, granite trader, Manikonda, Gachibowli appertments, Rayadurgam police, Cyberabad police, Hyderabad, Telangana, Andhra Pradesh, Crime

Sirishma, daughter of Andhra Intellectuals Forum president Chalasani Srinivas, has died under suspicious circumstances. The incident took place at Rayadurg in Hyderabad. She works as an interior designer, was married to Siddharth, a granite trader from Manikonda in 2016.

చలసాని శ్రీనివాస్ కూతరు అనుమానాస్పద మృతి

Posted: 02/19/2021 12:51 PM IST
Chalasani srinivas s daughter sirishma suspicious death

ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు, సమైక్యాంద్ర ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ కూతురు శీరిష్మ (27) ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని రాయదుర్గం పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించారు. ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న శిరీష్మకు నాలుగేళ్ల (2016)క్రితం ఓయు కాలనీలోని ట్రయల్ విల్లాస్ లో నివసించే గ్రానైట్ వ్యాఫారి సిద్ధార్థ్ తో వివాహం జరిగింది. గతకొంతకాలంగా శిరీష్మ మానిసిక సమస్యతో బాధపడుతుందని తెలుస్తోంది.

నాలుగేళ్లయినా వీరికి సంతానం కలగకపోవడంతో అమె మానసికంగా కుంగీపోయిందని సమాచారం. దీంతో వారు గత కోంత కాలం క్రితం వీరిద్దరూ గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్ సమీపంలోని అపార్టుమెంటుకు మారి.. అక్కడే నివసిస్తున్నారు. అయినా అమెలోని డిప్రెషన్ ను ఈ మార్పు కూడా నయం చేయలేకపోయింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి అమె ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి బిగింది ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. వ్యాపారం ముగించుకుని అమె భర్త ఇంటికి వచ్చేలోగా అమె ఈ విపరీత చర్యకు పాల్పడింది.

బుధవారం రాత్రి యధావిధిగా ఇంటికి వచ్చిన అమె భర్త సిద్దార్థ్ అమె ఇంట్లో ఉరి వేసుకున్న విషయాన్ని గమనించి.. హుటాహుటిన అమెను కిందకు దింపి చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించగా అప్పటికే అమె మరణించిందని వైద్యులు నిర్థారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చలసాని శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles