సూర్యభగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సూర్యనారాయణ మూర్తిగా భక్తజనులు ఆరాధించడం.. దీంతో రథసప్తమినాడు మలయప్ప స్వామికి సప్తవాహన సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే మలయప్ప స్వామివారిని టీటీడీ అధికారులు ఉదయం నుంచే సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంపై కోలువై తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ అక్కడ కోలువైన భక్తజనకోటికి అభయప్రధానం చేశారు.
ఉదయం ఐదున్నర నుంచి 8 గంటల వరకూ సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో పెద్ద సంఖ్యలో కొలువుదీరిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కరోనా అనంతరం మొదటిసారి తిరుమాడ వీధుల్లో వాహనాలపై ఊరేగడంతో భక్తులు తిరుమల కోండకు పొటెత్తారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే వాహన సేవలు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవతో ముగియనుంది. ఈ క్రమంలో ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు మలయప్ప స్వామి పాదాలను తాకాయి. దీంతో గ్యాలరీల్లోని భక్తులు ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తన్మయత్వం పోందారు.
ఇక సూర్యప్రభ వాహన సేవతో పాటు ఇవాళ చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలలో స్వామివారు తిరుమాడ వీధుల్లో సంచరిస్తారు. ఇక చివరన చంద్రప్రభ వాహనంలో ఊరేగించే శ్రీవారు భక్తులకు అభయప్రధానం చేస్తారు. కాగా, రథసప్తమి సందర్భంగా తిరుమల వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. ఆలయ మాడవీధుల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ఇవాళ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చనలు ఏకాంతంగా నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more