Petrol price in Hyderabad crosses Rs. 91 per litre హైదరాబాద్ లో రూ.91 దాటేన పెట్రోల్

Petrol price at an all time high crosses rs 91 in hyderabad city

oil price, crude oil, price hike, petrol, diesel, premium petrol price, sriganganar, rajasthan, petrol price in delhi, petrol price in mumbai, petrol price in chennai, petrol price in kolkatta, petrol price in hyderabad, petrol price in amaravati, dissel price in delhi, dissel price in mumbai, dissel price in chennai, dissel price in kolkatta, dissel price in hyderabad, dissel price in amaravati, regular petrol price, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices are hitting fresh record highs in the country every day as global crude oil prices continue to climb. After the fresh rate hike by oil marketing companies (OMC), the price of normal petrol has crossed Rs 91 per litre in Hyderabad city.

రికార్డుస్థాయి గరిష్టం.. హైదరాబాద్ లో రూ.91 దాటేన పెట్రోల్

Posted: 02/10/2021 12:31 PM IST
Petrol price at an all time high crosses rs 91 in hyderabad city

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన ప్రతీసారి ఎలాంటి సంకోచం లేకుండా ఉన్నపళంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రప్రభుత్వ అనుమతిలో పెంచేస్తున్న ఇంధన సంస్థలు మరోసారి ధరలను పెంచి వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల తగ్గింపు విషయమై కేంద్ర,రాష్ట్రలు విధిస్తున్న పన్నులు కాసింత ఉపసంహరించుకుంటే తప్ప వాహనదారులకు ఉపశమనం లభించదని కూడా సూచిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందని రాష్ట్రాలు.. రాష్ట్రాలు తగ్గిస్తాయని కేంద్రం ఎదరుచూస్తూ.. వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి.

కాగా ధరలు తగ్గిన సమయాల్లో మాత్రం ఆ ప్రయోజనాలను వాహనదారులకు అందకుండా మధ్యలో దేశాభివృద్దికి కోసమని కేంద్రం, రాష్ట్రాభివృద్దికని రాష్ట్రప్రభుత్వాలు ఎక్సైజ్ సన్నులు, వ్యాట్ లు విధిస్తూ.. కొత్త మార్గాలను అనుసరిస్తూ అందుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వాలు.. ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించకుండా ఎక్సైజ్ డ్యూటీ చార్జీలను పెంచుతూ అదాయావనురుగా మార్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఓ వైపు ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో కేంద్రం అటో రంగం వేగాన్ని అందుకునేందుకు చర్యలను తీసుకుంటామంటూనే.. ఇంధన ధరలను పెంచేయడం.. వాహనాల విక్రయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక తాజాగా పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, వాటితో పాటు స్థానిక పన్నులను కలిపి ఇంధన ధరలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధర లీటరు రూ.91 దాటి పరుగులు పెడుతోంది. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై అయిదు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.

తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.87.60కు చేరగా, డీజిల్ రూ.77.73
కోల్ కతాలో లీటరు పెట్రోలు రూ.88.92కు చేరగా, డీజిల్ రూ. 81.31
ముంబైలో లీటరు పెట్రోలు రూ.94.12 కు చేరగా, డీజిల్ రూ.84.63
చెన్నైలో లీటరు పెట్రోలు రూ.89.96కు చేరగా, డీజిల్ రూ.82.90
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ.91.07కు చేరగా, డీజిల్ రూ.84.79
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.92.48కు చేరగా, డీజిల్ రూ. 85.15
అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. 93.74కు చేరగా, డీజిల్ ధర రూ.86.94కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  Hyderabad  

Other Articles