YS Sharmila hints of new party, promises 'Rajanna Rajyam' తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తాం: వైఎస్ షర్మిల

Ys sharmila to meet ysr loyalists in hyderabad amid buzz over launching new party

YS Sharmila new party, YS Sharmila-Jagan Political Sketch, YSRCP Telangana, YSRCP Andhra Pradesh, YS Sharmila, YSRCP, TRS, Andhra Pradesh CM, Jagan Mohan Reddy Sister, Telangana, BJP, Congress, TRS, Andrha Pradesh, Politics

As the news of YS Sharmila, the sister of YSR Congress party president and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, likely to start her own political initiative in Telangana started making rounds, she assured YSR loyalists of getting 'Rajanna Rajyam' in the state.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తాం: వైఎస్ షర్మిల

Posted: 02/09/2021 03:07 PM IST
Ys sharmila to meet ysr loyalists in hyderabad amid buzz over launching new party

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారన్న వార్తలతో పాటు ఇవాళ అమె ఆపార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో లోటస్ పాండ్ లో ఇవాళ మళ్లీ సందడి నెలకోంది. అమెపై అభిమానం కురిపిస్తూ అభిమానులు లోటస్ పాండ్ వద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. కోటేషన్లు రాసి.. వైయస్ షర్మిల కోసం వేచిచూస్తూ నినాదాలు చేశారు. దీంతో అమె ఎట్టకేలకు అభిమానుల ముందుకు వచ్చారు.  

శ్వేతవర్ణపు చీరలో అభిమానుల ముందకు వచ్చిన అమె.. చిరునవ్వుతో అందరికీ ఆమె అభివాదం చేశారు. మధ్యమధ్యలో అమె తన తండ్రి తరహాలో అభిమానులకు చేతులు ఊపుతూ హుషారెత్తించారు. ఈ సందర్భంగా ఆమె కొత్త పార్టీని స్థాపించడం ఖాయమన్న సంకేతాలను ఇచ్చిన అమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు కదులుతామని అన్నారు. మీడియా వర్గాలు అమెను పలు ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేయగా... ఆమె పొడిపొడిగానే సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.

అందరూ కాస్త ఓపిక పట్టాలని... అన్ని విషయాలు చెపుతానని ఆమె అన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ ముందుకు సాగారు. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు  చేశామని చెప్పారు. తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని... ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు.

కాగా, ఇవాళ నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు. మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. తన తండ్రి వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Sharmila  YSRCP  TRS  Andhra Pradesh CM  Jagan Mohan Reddy Sister  Telangana  Politics  

Other Articles