AP SEC directs to keep unanimous polls pending ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్..

Ap sec focusses on unanimous polls directs officials to keep them pending

SEC focus on unanimous polls, SEC directs to hold unanimous results, unanious polls in guntur, unanimous polls in chittoor, Nimmagadda Ramesh Kumar ,SEC, Guntur, Chittoor, AP panchayat elections 2021, unanimous poll results, Andhra Pradesh, Politics

The State Election Commission has focused on the highest number of panchayats being declared unanimous in Chittoor and Guntur districts. SEC Nimmagadda Ramesh Kumar has already asked the collectors of the two districts for a report. The SEC opined that the unanimous results across the state were not conducive to the appeared in these two districts.

ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్..

Posted: 02/05/2021 05:27 PM IST
Ap sec focusses on unanimous polls directs officials to keep them pending

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగిన వెంటనే.. రాష్ట్రప్రభుత్వం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవాలు అయిన గ్రామపంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నగదును పెంచేసింది. దీంతో పలు పంచాయతీల పరిధిలోని ప్రజలు తమకు పదవుల కన్నా గ్రామాభివృద్దే ముఖ్యమంటూ ఏకగ్రీవాలకు సై అంటున్నారు. అయితే ఇదే సమయంలో కాసింత రాజకీయ పట్టు అధికంగా వున్న గ్రామాల్లో మాత్రం తమదే పైచేయి సాధించాలన్న పట్టుదలలో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు రెడీ అవుతున్నాయి. అయితే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది.

ఈమేరకు రెండు జిల్లాల్లో అత్యధికసంఖ్యలో గ్రామపంచాయితీలు ఏకగ్రీవం కావడానికి కారణాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కలెక్టర్లను నివేదిక కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు పొంతన లేదని ఎస్‌ఈసీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలపై చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు వివరణాత్మక నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నివేదికలు పరిశీలించిన తర్వాతే కమిషన్‌ తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  

గుంటూరు జిల్లాలో తొలివిడతతో మొత్తం 337 సర్పంచి స్థానాలకు గాను 67 గ్రామపంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే 63 కాగా, రెండు స్థానాల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక స్వతంత్రులు మరో రెండు స్థానాల్లో ఏకగ్రీవమయ్యారు. మొత్తం మీద 20 శాతం మేర ఏకగ్రీవాలు జరిగాయి. అభ్యర్థులు నామినేషన్ల పోటాపోటీగా వేసినప్పటికీ ఉపసంహరణకు చివరిరోజు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అధికారపార్టీ నేతలు గ్రామస్థాయిలో మంత్రాంగం జరిపి ఎక్కువ పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారు.

సర్పంచి, ఉపసర్పంచి పదవుల కాలాన్ని పంచడం ద్వారా కొందరిని పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. టీడీపీ సానుభూతిపరులు పోటీలో ఉంటే కచ్చితంగా విజయం సాధిస్తారన్న పరిస్థితి ఉన్నచోట ఆయా అభ్యర్థులను తమవైపు తిప్పుకుని సొంత పార్టీ తరఫున అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆయా అభ్యర్థులకు పార్టీ కండువా కప్పి ఏకగ్రీవం చేసుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవమైనా వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసిన ఒకరిద్దరు ఉపసంహరించుకోకపోవడంతో ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  

చిత్తూరులో తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యే నాటికి 112 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార వైసీపీ మద్దతుదారులు 95 మంది, టీడీపీ మద్దతుదారులు తొమ్మిది మంది, స్వతంత్రులు ఎనిమిది మంది ఉన్నారు. తొలి దఫాలో 468 పంచాయతీలకుగాను 453 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 341 స్థానాలకు ఈనెల 9న పోలింగ్‌ జరగనుంది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 137 సర్పంచి స్థానాలకుగాను 26 చోట్ల పోటీ లేకుండా పోయింది. 2499 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles