India's reputation taking massive hit: Rahul Gandhi రైతులు సమస్యలపై ప్రధానిని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.!

Farmers won t back down government will have to rahul gandhi

Rahul Gandhi, Rihanna, Mia Khalifa, Greta Thunberg, Lilly Singh, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, delhi, politics

Farmers protesting the agriculture laws will not back down and it is in the government's interest to relent, Congress MP Rahul Gandhi said amid renewed support for those fighting to repeal the laws, particularly after emotional appeals from Bharatiya Kisan Union (Arajnaitik) chief Rakesh Tikait and a six-word tweet from international pop star Rihanna.

రైతులు సమస్యలపై ప్రధానిని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.!

Posted: 02/03/2021 05:29 PM IST
Farmers won t back down government will have to rahul gandhi

ఢిల్లీ శివారల్లో అన్నదాతలు ఓ వైపు నిరసన దీక్షలు చేస్తుంటే వారిని అణిచివేసి.. గోంతు వినిపించకుండా చేయడం.. వారిని ఒక విధంగా నిర్భంధనం చేయడం ద్వారా ప్రధాని ఏం సాధించాలని అనుకుంటున్నారో దేశప్రజలకు తెలపాల్సిన అవసరం వుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఉన్న ప్రధాన మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని వారితో అసత్య ప్రచారాలు చేయించడం ద్వారా హస్తినలో అసలేం జరుగుతుందన్న విషయం దేశప్రజలకు తెలియకుండా ఏలాపోతుందని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యలపై ప్రధాని వారితో చర్చించి పరిష్కరించాల్సిన అవసరం వుందని ఆయన హితవు పలికారు.

రైతు సమస్యల పరిస్కారం కోసం నెలల తరబడి దీక్షలు చేయడం దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని సూచించారు. దేశానికి జీవనోపాధి కల్పించే అన్నదాతలు ఇవాళ దేశ రాజధాని చుట్టూ నిరసన దీక్షలు చేస్తున్నారని అన్నారు. రైతులను ప్రభుత్వం ఎందుకు భయాందోళనలకు గుర్తిచేస్తోందో చెప్పాలని, వారిపై ఎందుకు లాఠీలను ఝేుళిపిస్తుందో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీని దుర్భేద్యమైన కోటగా కేంద్రం మార్చేసిందని, రైతులతో ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గరని, ప్రభుత్వమే దిగిరావాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ దేశానికి వెన్నెముక లాంటివారని, అలాంటి వెన్నెముకను కేంద్రం తుంచాలని చూస్తోందని మండిపడ్డారు.

సాగు చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలన్నదే రైతుల డిమాండ్ అని, కానీ కేంద్రం మాత్రం ఈ డిమాండ్‌ను విస్మరిస్తోందని రాహుల్ విమర్శించారు. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై ఇతర దేశాల సెలెబ్రెటీలు స్పందించడంపై కూడా రాహుల్ స్పందించారు. ‘ఇది భారత్ అంతర్గత వ్యవహారం’ అని రాహుల్ తేల్చి చెప్పారు. మరో రెండేళ్ల పాటు సాగు చట్టాలను నిలిపేస్తామన్న ప్రతిపాదన ఇప్పటికీ సజీవంగానే ఉందని ప్రధాని పేర్కొన్నారని, దీనర్థమేందని ప్రశ్నించారు. శాశ్వతంగా చట్టాల్ని ఉపసంహరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రం భావిస్తోందా? లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం పారిపోకుండా రైతుల సమస్యలను విని, శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని రాహుల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles