Kishan to steer BJP poll strategy in TN కిషన్ రెడ్డికి తమిళనాడు ఎన్నికలకు బాధ్యత

Bjp appoints election in charges for 4 poll bound states tomar g kishan reddy in the mix

kishan Reddy, Union Minister, BJP Tamil Nadu Election Incharge, BJP TN Assembly election Incharge, Stalin, Sasikala return, AIADMK, AMMK, Kamal Hassan, jayalalithaa, VK Sasikala, TN Assembly election, DMK, TTV Dhinakaran, tamil nadu elections, tamil nadu assembly elections, Tamil Nadu, Politics

BJP has appointed minister of state for home affairs G.Kishan Reddy as election in-charge for Tamil Nadu. Apart from Kishan, Union minister Pralhad Joshi would be election in-charge for Kerala and Arjun Ram Meghwal for Puducherry election.

కిషన్ రెడ్డికి తమిళనాడు ఎన్నికలకు బాధ్యతను అప్పగించిన బీజేపి

Posted: 02/03/2021 11:13 AM IST
Bjp appoints election in charges for 4 poll bound states tomar g kishan reddy in the mix

తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలకు సమరశంఖాన్ని త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం పూరించనున్న వేళ.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ ఇక్కడ కూడా తమ ఉనికిని చాటాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలోకి రాలేమని పార్టీ అధిష్టానికి ఇప్పటికే అవగతమైనా.. ఉనికి చాటే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందా.? అంటే కాదన్న సమాధానలే వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను కట్టబెట్టింది.  

ఈ మేరకు బీజేపి కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కిషన్ రెడ్డిని తమిళనాడు ఎన్నికల ఇంచార్జీగా నియమించడంతో పాటు మరో కేంద్రమంత్రి వికే సింగ్ ను తమిళనాడు బీజేసి సహ ఇంచార్జీగా నియమించింది. తమిళనాడుతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా బీజేపి పార్టీ తమ ఇంచార్జులను, సహ ఇంచార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడులో బీజేపి పార్టీకి ఎన్నికల ఇంచార్జీగా కిషన్ రెడ్డి.. ఎలా తన ఉనికిని చాటుకుంటారో అన్న ఆసక్తి తెలంగాణ ప్రజల్లో నెలకొంది.

ఈ క్రమంలో అసోం ఇంచార్జి‌, సహ ఇఇంచార్జులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, జితేంత్రసింగ్ లను నియమించగా, కేరళ ఇంచార్జిగా ప్రహ్లాద్ జోషి, సహ ఇంచార్జిగా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, పుదుచ్చేరి ఇంచార్జి, సహ ఇంచార్జిలుగా కేంద్రమంతి అర్జున్ మేఘ్వాల్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌లను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles