SEC reschedules panchayat polls ‘పంచాయతీ’ ఎన్నికల రీషెడ్యూల్.. ఫిబ్రవరి 9 నుంచి నాలుగు విడతల్లో..

State election commission reschedules the panchayat elections

panchayat elections re-shedule, re-shedule of GP Elections, supreme court, gram panchayat elections, nimmagadda ramesh kumar, SEC, AP gram panchayat elections re-shedule, AP Government, YSRCP, Supreme Court, Andhra pradesh HIgh Court Division Bench, Panchayat raj Employees, AP panchayat elections, polling officials nomination papers, nomination papers, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

The state election commission has rescheduled the panchayat elections in Andhra Pradesh. The government has made changes to the previously released schedule as there is less time for the government to conduct elections. According to the new schedule, the second phase was changed to the first phase, the third phase to the second phase, the fourth phase to the third phase then followed by fourth phase.

‘పంచాయతీ’ ఎన్నికల రీషెడ్యూల్.. ఫిబ్రవరి 9 నుంచి నాలుగు విడతల్లో..

Posted: 01/25/2021 04:03 PM IST
State election commission reschedules the panchayat elections

ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు అదేశాలిస్తూ.. ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటీషన్లు అన్నింటినీ తిరస్కరించిన వెంటనే ఆయన రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలను మార్చుతూ రీషెడ్యూల్ చేశారు. దీంతో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నాలుగు విడతల్లో జరగాల్సిన ఎన్నికలు ఫిబ్రవరి 9 నుంచి నాలుగు విడుతల్లో జరగనున్నాయి.

గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఫిబ్రవరి 5, 9, 13, 17న ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే తాజాగా విడుదల చేసిన రీషెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా, గతంలో రెండో విడత ఎన్నికలను తాజా షెడ్యూలు ప్రకారం తొలి విడతగా, గత మూడో విడత ఎన్నికలను తాజాగా షెడ్యూలు ప్రకారం రెండో విడత ఎన్నికలుగా, గత నాలుగో విడత ఎన్నికలను తాజా షెడ్యూలు ప్రకారం మూడో విడతగా నిర్వహించనున్నారు. ఇక తొలి విడత ఎన్నికలను ఈ నెల 21కి వాయిదా వేస్తూ తాజా షెడ్యూలు ప్రకారం ఇదే నాలుగో విడత ఎన్నికగా నిర్వహించనున్నారు.  

దేశ సర్వోన్నత న్యాయస్థానం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పును వెలువరించిన తరువాత ఈ మేరకు ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ఎన్నికలకు సిద్దం కానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తొలి విడత ఎన్నికలకు ఈ నెల 29 నుంచి, రెండో విడతకు ఫిబ్రవరి 2, మూడో విడతకు ఫిబ్రవరి 6, నాలుగో విడతకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఎన్నికల సిబ్బంది తగిన రీతిలో సిద్దం కావాలని కూడా అయన అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles