ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటీషన్లను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను యధావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై విచారించిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని రెండు విభిన్న అధికారాల మధ్య పంచాయతీ ఎన్నికల సమస్య తలెత్తడానికి తమ మాట గెలిచి తీరాలన్న పంతం ఉతన్నమైందని, దీంతో రాష్ట్రంలో చట్టబద్దత లోపించడానికి కారణంగా మారుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అధికారాల మధ్య పంతంలో తాము భాగం కాదల్చుకోలేదని పేర్కోంది.
విచారణ సంరద్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు, పంచాయతీ రాజ్ అధికారులు ఎలా తీర్మాణాలను చేస్తారని, వాటిని ఎలా అమోదిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ సమస్య ఉత్పన్న కావడం వెనుక మరేదో కారణం వుందని అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాలకు పలు బాధ్యతలు వుంటాయని, వాటిన్నింటి నిర్వహణను తాము తీసుకోలేమని చెప్పింది. ఎన్నికల నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, అది వారే చేయాలని న్యాయస్థానం పేర్కోంది.
కాగా కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని.. వాక్సినేషన్ డ్రైవ్ ఫిబ్రవరి 28 నాటికి పూర్తైన తరువాత మార్చిలో నిర్వహించుకోవచ్చునని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కారణంగా వెలువరించకుండా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన హైకోర్టు సింగిల్ జడ్జీ తీర్పును మీరు సమర్ధిస్తున్నారా.? అంటూ న్యాయస్థానం ఆయనను ప్రశ్నించింది. ఇక కరోనా సమయంలోనే పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయని, ఇక వాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల వాయిదా సముచితం కాదని ధర్మాసనం పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more