Railway officer lands in CBI net on graft charge సీబీఐ వలకు చిక్కిన బడా రైల్వే అధికారి..

Cbi lays trap nabs railways officer for seeking bribe of rs 1 crore

CBI Railways officer, Indian Railways Mahendra Singh Chauhan, Mahendra Singh Chauhan CBI case, North Eastern Frontier Railway bribery, Indian Railways bribery case, indian railway contract, ABCI Infrastructures Private Limited, Crime

CBI has arrested a 1985-batch officer of the Indian Railways for accepting a bribe of Rs 1 crore. This is the most significant bribe the CBI has ever apprehended a government officer with. The officer Mahendra Singh Chauhan, has been taken into custody for demanding and accepting a bribe of Rs 1 crore in exchange for favouring a private company with respect to contracts handed out by the North Eastern Frontier Railway.

రూ.కోటి లంచంతో.. సీబీఐ వలకు చిక్కిన బడా రైల్వే అధికారి..

Posted: 01/18/2021 02:42 PM IST
Cbi lays trap nabs railways officer for seeking bribe of rs 1 crore

కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా దోరికిపోయిన అధికారి కేసు సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా కీలకంగా మారింది, ఈశాన్య సరిహద్దు రైల్వేస్ విభాగంలో ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి (ఐఆర్ఈఎస్) సహా మరో ఇద్దరు అధికారులను కూడా సీబిఐ అధికారులు అరెస్టు చేశారు, వీరి డిమాండ్ చేసిన కోటి రూపాయల లంచం డబ్బుతో పాటు రెడ్ హ్యాండెడ్ ‌గా పట్టుకుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ పలు కాంట్రాక్టు పనులను ఓ సంస్థకు అందించేందుకు ఈ ఉన్నతాధికారి సహా మరో ఇద్దరు అనుబంధ అధికారులు ఈ పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే,, అస్సాం రాజధాని గువాహటి సమీపంలోని మాలిగావ్ లోఈశాన్య సరిహద్దు రైల్వేస్ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏఓ) / కన్స్ట్రక్షన్- II గా నియమితుడైన 1985 బ్యాచ్ అధికారి... మహేందర్ సింగ్ చౌహాన్ తన పరిధిలోని రైల్వే విభాగంలో అభివృద్ది పనులను ఓ సంస్థకు కేటాయించేందుకు గానే సంబంధిత సంస్థ నుంచి కోటి రూపాయల లంచాన్ని డిమాండ్ చేశారు, ఈ డబ్బును ఏర్పాటు చేసిన ఏబిసీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ అందిస్తుండగా రంగంలోకి దిగిన సీబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, గతంలోనూ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినప్పటికీ ఇది మాత్రం సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారులు దేశ్యాప్తంగా ఢిల్లీ, ఉత్తరాఖండ్, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లోని 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.54 లక్షలను స్వాధీనం చేసుకున్నారు, గతంలోనూ ఇదే అధికారికి లంచం ఇచ్చామన్న అభియోగాలు నమోదైన కేసులోని రూ. 60 లక్షలను కూడా సీబిఐ దాడుల నేపథ్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు, ఈ కేసులో మహేంద్ర సింగ్ చౌహన్ తో పాటుగు ఢిఫ్యూటీ చీఫ్ ఇంజనీర్ హేమ చంద్ బోరా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీకాంత్ వర్మపై కూడా అభియోగాలు మోపబడ్డాయి. వీరితో పాటు ఏబిసీఔ ఇన్ ఫ్రా డైరెక్టర్ పవన్ బైద్ "సహా సంస్థ ఉద్యోగి భూపేంద్ర రావత్, రైల్వే అధికారి సమీప బంధువు ఇంద్ర సింగ్ పేరు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈశాన్య సరిహద్దు రైల్వే విభాగంలోని కొందరు ఉన్నతాధికారులు బాగా లంచాలకు అలవాటు పడి ప్రైవేటు కాంట్రాక్టర్లతో కలిసి అవినీతి చర్యలకు పాల్పడుతున్నట్లు అరోపణలు రావడంతో ఈ ప్రాంతంలోని రైల్వే అధికారులపై సీబిఐ అధికారులు నిఘా పెట్టారు, కాంట్రాక్టులను భద్రపరచడం, తదుపరి బిల్లుల ప్రాసెసింగ్, చెల్లింపులు సహా ఇతర పనులలోనూ కాంట్రాక్టర్లకు అనుగూణంగా అధికారులు వేగవంతమైన సేవలను అందిస్తున్నారు, అందుకు భారీగా సోమ్ము కూడా లంచాల రూపంలో చేతులు మారుతుందని పసిగట్టిన సిబిఐ అధికారులు ఎట్టకేలకు పెద్ద అవినీతి జలగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఊచలు లెక్కపెట్టిస్తున్నారు, కాగా, నకిలీ బిల్లుల క్లియరన్స్ కేసులో సీబీఐ గతేడాది నలుగురు అధికారులపై కేసులు నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles