Be ready for war 'at any second': Xi Jinping to China's military ప్రపంచ దేశాలకు వేడి పుట్టేటా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు

Chinese president xi jinping orders military to scale up combat readiness to act at any second

Xi Jinping, China, Peoples Liberation Army, Chinese military, Chinese Communist Party, china president, Ladakh, India chain border standoff, line of actual control

Chinese President Xi Jinping, who now wrests greater control over People's Liberation Army (PLA), has asked the military to step-up training and combat readiness. Notably, ever since Xi became the commander-in-chief in late 2012, he has always stressed on the importance of combat readiness training.

ప్రపంచ దేశాలకు వేడి పుట్టేటా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు

Posted: 01/06/2021 08:40 PM IST
Chinese president xi jinping orders military to scale up combat readiness to act at any second

(Image source from: Timesofindia.indiatimes.com)

ప్రపంచ దేశాలన్నీ శాంతిసందేశం ఇస్తూ.. యుద్దాలకు దూరంగా అభివృద్దిలో వేగంగా దూసుకెళ్లి ఏ దేశంతోనైనా ఆర్థికంగా, అభివృద్ది పరంగా పోటీ పడేందుకు సిద్దపడుతున్న తరుణంలో చైనా మాత్రం తమ రూటు సపరేట్ అంటూ మరోమారు నిరూపించుకుంది. సైనిక బలగాలపై అధ్యక్షునికి విస్తృత అధికారాలను కల్పిస్తూ కొత్త రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సైనికుల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తమ దేశ సైన్యాని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి, ఇంతకీ అంతగా వేడిరాజేసిన వ్యాఖ్యలు ఏంటంటే..

దేశం ఏ క్షణాన యుద్దం వచ్చినా.. వాటిని పూర్తి సన్నధ్ధతతో పోరాడేందుకు సిద్దంగా ఉండాలని ఆయన తమ దేశ సైన్యమైన పీపుల్స్ ఆర్మీకి అప్రమత్తతతో కూడిన సందేశాన్ని అందించారు. అంతేకాదు తమ ఆర్మీ వాస్తమ యుద్దరంగాన్ని తలపించే పరిస్థితుల్లో ఆర్మీ శిక్షణ పోందాలని కూడా సూచించారు. దీంతో అసలు చైనా అధ్యక్షుడి వాఖ్యలు దేనికి ఆజ్యం పోస్తున్నాయని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇక దీంతో పాటు సైనికులు పోరాట నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు.అధునాతన ఆయుధాలను వాడే విధానం, వాటి ప్రయోగాల విషయంలో పూర్తి అవగాహన కలిగి వుండాలని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు.

పోరాట వ్యూహాలపై మరింత పరిశోధనలు చేయాలని, యుద్దం వచ్చిన నేపథ్యంలో శత్రువర్గాలపై విజయాన్ని అందుకునేలా వ్యూహాలను కూడా రచించే సత్తా వుండాలని సూచించారు. కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగానూ ఉన్నారు. ఈ కమిషన్ కు సంబంధించిన తొలి ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. చైనా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలపై దుమారం రేగుతుంటూ.. చైనా మాత్రం తమ దేశ అధ్యక్షుడు పీప్సుల్స్ ఆర్మీని సన్నధంగా, జాగృతంగా ఉంచేందుకు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలను వినియోగించారని క్లారిటీ ఇస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles