'No government can face the wrath of farmers' సాదుసజ్జనులు కూడా రైతులకు తలోగ్గాల్సిందే.!

P chidambaram warns government of wrath of farmers who feel deceived

Senior Congress leader P Chidambaram, P Chidambaram warns Government of India, Chidambaram on farmers protest, P Chidambaram favourite poet-saint, P Chidambaram poet Tiruvalluvar, P Chidambaram on three central agricultural laws, P Chidambaram, farmers protest, favourite poet, Tiruvalluvar, poet saying on farmers, Tiruvalluvar quotes, central government, new agriculture laws, Politics national politics

Senior Congress leader P Chidambaram has warned the Government of India of the wrath of farmers 'who believe they are being deceived' even as it began talks with protest leaders in New Delhi. In a tweet posted today, the former Finance Minister quoted his favourite poet-saint, Tiruvalluvar, to burnish his view on the ongoing stalemate over the three central agricultural laws that have sparked a furore across the country.

రైతు ఆగ్రహాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదు: చిదంబరం

Posted: 01/05/2021 09:36 PM IST
P chidambaram warns government of wrath of farmers who feel deceived

(Image source from: Financialexpress.com)

దేశరాజధాని ఢిల్లీలో రైతులు గత నెల రోజులకు పైగా అందోళన చేపడుతున్న విషయమై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తనదైన శైలిలో కేంద్రాన్ని హెచ్చరించారు. రైతులతో పెట్టుకుంటూ సాధు, సజ్జనులు కూడా మనుగడ సాగించలేరని తన అభిమాన కవి తన వ్యాఖ్యలను ఊటంకించారు, పెద్దల మాట సద్దన్న మూట అని ఫాలో అయ్యే మనం.. రెండు వేళ ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని అప్పటి కవులు, కళాకారులు గ్రహించి తమ కవిత్యాలలో పోంచుపర్చారని అయన అన్నారు, ఈ సందర్భంగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమంపై ఆయన స్పందించారు. రైతుల కోపాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదని హెచ్చరించారు.

తాము మోసపోతున్నమాని గ్రహించిన రైతుల కోప్పాన్ని ఏ ప్రభుత్వం తట్టుకోలేదని చిదంబరం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన తిరువళ్లువర్ బోధనలను ప్రస్తావించారు, రైతులు చేతులు ముడుచుకుని కూర్చుంటే.. జీవితాన్ని త్యజించిన వ్యక్తలు.. సాధు, సజ్జనులు కూడా మనుగడ సాగించలేరని ఈ విజయాన్ని రెండు వేల ఏళ్ల క్రితమే తన అభిమాన కవి తిరువళ్లువర్ తన రచనల్లో వెల్లడించారని అన్నారు, ప్రస్తుతం ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయని చిదంబరం అభిప్రాయపడ్డారు, కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివార్తలో గత నెల రోజులకు పైగా ఉద్యమిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

రైతులు తమ ఉనికికి ఈ నూతన వ్యవసాయ చట్టాలతో ముప్పు పోంచి వుందని తెలుసుకున్న రైతులు.. వాటి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారని.. తాము ఎన్నుకున్న ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారని చిదంబరం అన్నారు. వారి కోపాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదని ఆయన ట్వీట్ చేశారు, చట్టాల రద్దుతో పాటు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఇప్పటికే రైతన్నలు హెచ్చరించారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి రైతు సంఘాల నేతలతో చర్చలు వేగిరం చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles