Somu Veerraju sensational comments on YS Jagan నవ్యాంధ్ర రాజధానిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Andhra bjp president somu veerraju sensational comments on ys jagan

Andhra BJP President, Somu Veerraju, Amaravati, HIndus, Temples, Church, Durga, Vellampalli Srinivas Rao, YSRCP, BJP, Three Capitals, Central Institutions, Indian Kisan Sangh, Tulluru, defencr academy, nimbakur, PM Modi, Andhra Pradesh, Politics

The BJP Andhra Pradesh state president Somu Veerraju said that the state government is misusing money or the development of Durgas and Churches in the state. He also demands the CM YS Jagan to remove Endowment minister Vellampalli Srinivas Rao in this regard.

నవ్యాంధ్ర రాజధానిపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Posted: 12/16/2020 11:11 PM IST
Andhra bjp president somu veerraju sensational comments on ys jagan

నవ్యాంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేవని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాల నుంచి వస్తున్న డబ్బును ఇతరాత్ర మతాలకు, మత ప్రార్థనా మందిరాలకు వెచ్చించడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సొమ్మును చర్చీలకు రూ.24 కోట్లు, దర్గాలకు రూ.5 కోట్ల కేటాయించడం ఎంతమవరకు సమంజసమని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి చెందాల్సిన డబ్బును చర్చీల నిర్మాణాలకు, దర్గాల పునరుద్దరణకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ తీరు అందోళనకరంగా వుందన్నారు.

రాష్ట్రంలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటి పునురద్దరణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాకు వస్తున్న నిధులులో హిందువుల నుంచే అధిక నిధులు వస్తున్ాయయన్న విషయాన్ని సీఎం, ప్రభుత్వం మర్చిపోయారా.? అని ఆయన నిలదీశారు, పుష్కరాల పేరుతో చంద్రబాబు హయాంలో అనేక ఆలయాలను పడగొట్టారని గుర్తు చేసిన సోమువీర్రాజు... అప్పుడు బీజేపీలో ఉన్న ప్రస్తుత దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పడగొట్టిన ఆలయాలను మళ్లీ కట్టాలని డిమాండ్ చేశారని కూడా ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే నేత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ దర్గాలను కడతామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయనకే తెలియాలని విమర్శించారు.

దేవాలయాల భూములను ఇళ్ల స్థలాలకు, ఆలయాల నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్న మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువులపై ముఖ్యమంత్రికి నిజంగా గౌరవం, ప్రేమ ఉంటే వెల్లంపల్లిని తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, రాష్ట్రంలో ఉన్న చర్చిలకు వేల కోట్ల ఆదాయాలున్నాయని... జగన్ కు దమ్ముంటే వాటి నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు చేయాలని సవాల్ విసిరారు. జగన్ కు చర్చిలు, దర్గాలు మాత్రమే కావాలా? ఆలయాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగసభకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోందని... ఆ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Somu Veerraju  Amaravati  HIndus  Temples  Church  Durga  Vellampalli Srinivas Rao  YSRCP  BJP  Andhra Pradesh  Politics  

Other Articles